Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బంతి! చామంతి! పూబంతి! అవంతి!!

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత మూడు సంవత్సరాలపాటు జిల్లాలో ఒక వెలుగు వెలిగారు

రాజకీయాల్లో పదవి లేకపోతే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఆ మాజీ మంత్రికి అవగతమవుతోంది. సొంత పార్టీకి చెందిన నాయకులే ఆయనతో టచ్ మీ నాట్ గా ఉంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కనీసం పోటీచేయడానికి టికెట్ దక్కుతుందా? లేదా? అనే అనుమానం ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. సొంత నియోజకవర్గంలోనే అవమానాలు ఎదురవుతుండటంతో సదరు మాజీ మంత్రి అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

పగ్గాలు చేపట్టిన పంచకర్ల

పగ్గాలు చేపట్టిన పంచకర్ల

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత మూడు సంవత్సరాలపాటు జిల్లాలో ఒక వెలుగు వెలిగారు. రెండోసారి ఏర్పాటైన మంత్రివర్గంలో చోటు కోల్పోయారు. తర్వాత అధిష్టానం విశాఖపట్నం జిల్లా బాధ్యతలు అవంతికి అప్పగించింది. కొద్దిరోజుల తర్వాత పంచకర్ల రమేష్ బాబు ఆయన స్థానంలో పగ్గాలు చేపట్టారు. పార్టీలో సీనియర్లకు పంచకర్ల ప్రాధాన్యం పెంచడంతోపాటు తన వర్గాన్ని పక్కన పెట్టడంతో అవంతి పార్టీ కార్యాలయం గుమ్మం తొక్కడంలేదు. కీలకమైన సమావేశాలుంటే అలా కనపడి వెళ్లిపోతున్నారు.

ముఖ్య నేతలతో తగ్గిన సఖ్యత

ముఖ్య నేతలతో తగ్గిన సఖ్యత

వైసీపీ ముఖ్య నేతలతో అవంతికి సఖ్యత తగ్గిందనే ప్రచారం నడుస్తోంది. జిల్లా నాయకత్వంతోనూ గ్యాప్‌ పెరిగిపోయిందని, ప్రస్తుతం అవంతి ఒంటరయ్యారనే అభిప్రాయం ఆయన అనుయాయుల్లో వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినేలా ఆడియో టేపులు వైరలయ్యాయి. ఒకరకంగా ఆయన పొలిటికల్ కెరీర్ కు అవి మచ్చను తెచ్చాయని అవంతి సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడానికి వెళితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు రోడ్డుకు అడ్డంగా చెప్పులదండ కట్టి ఎమ్మెల్యేను అవనమానించారు. మాజీ మంత్రిని టార్గెట్ చేసినప్పుడు వైసీపీ నాయకులెవరూ మద్దతవ్వలేదు.

ఫ్లెక్సీలో కనిపించని అవంతి ఫొటో

ఫ్లెక్సీలో కనిపించని అవంతి ఫొటో


ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వైసీపీ ప్రాంతీయ పార్టీ కార్యాలయం ఫ్లెక్సీ వ్యవహారం దుమారం రేపింది. ప్రారంభోత్సవ ఆహ్వానంలో మాజీ మంత్రి అవంతి ఫొటో కనిపించలేదు. కావాలనే ఫొటో పెట్టలేదని అవంతి అనుచరులు గొడవకు దిగారు. దీంతో ఫ్లెక్సీలో అప్పటికప్పుడు అవంతి ఫొటోను అతికించారు. అవంతికి దగ్గరగా ఉండే నాయకులంతా మంత్రి అమర్నాథ్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిలిపై ఎక్కువ ఫోకస్‌ పెడుతున్నారు. మినిస్టర్‌గా ఉన్నప్పుడు నియోజకవర్గ బాధ్యతలన్నీ కుటుంబ సభ్యులకు అప్పగించారు అవంతి. దాంతో కేడర్‌కు.. అవంతికి గ్యాప్‌ వచ్చింది. తాజాగా ఆ గ్యాప్ ను తగ్గించుకునే దశలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరఫున భీమిలిలో పోటీచేసే అవకాశాలున్నాయి. అది వాస్తవరూపం దాలిస్తే అవంతికి గట్టి పోటీ తప్పదని, అయితే ముందు భీమిలీలో అవంతికి అధిష్టానం సీటిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+