విశాఖ పోర్టు వేదాంత లోడర్ వద్ద ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
విశాఖపట్టణం పోర్టులో ప్రమాదం జరిగింది. పోర్టులో గల వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. కన్వేయర్ బెల్ట్ వద్ద మంటలు అంటుకున్నాయి. గాలిలోకి మంటలు ఎగసిపడుతున్నాయి. దట్టమైన పొగ అవహించింది.

పోర్టు అధికారులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయంపై క్లారిటీ లేదు. షార్ట్ సర్క్యూట్ లేదంటే.. మరో కారణమా తెలియాల్సి ఉంది.
పోర్టులో వేదాంత ప్రైవేట్ లిమిటెడ్ లోడర్ వద్ద అగ్ని ప్రమాదం కన్వేయర్ బెల్ట్ అంటుకున్న మంటలు గాలిలోకి దట్టమైన పొగలు#Visakhapatnam #Fire #Vedanta pic.twitter.com/KYnYzISjnw
— oneindiatelugu (@oneindiatelugu) May 30, 2022












Click it and Unblock the Notifications