Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖలో భారీ అగ్నిప్రమాదం: పోలీసుల ఆరా: శాంతి భద్రతలను భగ్నం చేసే కుట్ర: విచారణకు జగన్ ఆదేశం

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం రాత్రి స్థానిక ఫిషింగ్ హార్బర్‌లో సంభవించిన ఈ ప్రమాదం పలు బోట్లు అగ్నికి అహూతి అయ్యాయి. వాటి విలువ సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.

డిసెంబర్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన క్యాంప్ కార్యాలయాన్ని తాడేపల్లి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి సన్నాహాలు పూర్తి చేసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఘటన సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయ కోణాన్ని స్పృశించేలా చేస్తోంది.

Massive fire accident at Visakhapatnam fishing Harbour, police launch investigation

మొదట బోటులో మంటలు చెలరేగాయి. క్షణాల్లో విస్తరించాయి. పక్కనే వరుసగా ఉన్న బోట్లను అంటుకున్నాయి. సముద్రం మీదుగా వీస్తోన్న గాలి తోడు కావడంతో అగ్నికీలలు వేగంగా వ్యాప్తిచెందాయి. 40 ఫిషింగ్ బోట్లు మంటలకు అహూతి అయ్యాయి. పూర్తిగా దగ్ధం అయ్యాయి.

మంటలను వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి మత్స్యకారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. వాటిల్లో నిల్వ ఉంచిన డీజిల్, వంట గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. సముద్రం మీద చేపలవేటకు వెళ్లినప్పుడు వాటిని వినియోగిస్తుంటారు మత్స్యకారులు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పినప్పటికీ.. భారీగా ఆస్తినష్టం సంభవించింది.

కాగా- ఈ సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సంబంధిత శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.

Massive fire accident at Visakhapatnam fishing Harbour, police launch investigation

కాగా- ఈ ఘటన వెనుక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రమాదం సంభవించకపోవడాన్ని స్థానికులు ఉదహరిస్తోన్నారు. విశాఖపట్నంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేయడానికి ఉద్దేశపూరకంగానే తెలుగు దేశం నాయకులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అంటున్నారు.

వైఎస్ జగన్ తన క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు తరలించే ఏర్పాట్లను చురుగ్గా కొనసాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని, శాంతి భద్రతలకు భంగం కలిగించడానికి టీడీపీ నాయకులు చేసిన కుట్రగా చెబుతున్నారు స్థానికులు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+