Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజధాని విశాఖకు రండి: ముఖేష్ అంబానీకి మంత్రి గుడివాడ ఆహ్వానం: ఆనంద్ మహీంద్ర సహా

విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న మూడు రాజధానుల అంశం.. ముందుకు కదులుతోంది. ఆ దిశగా ఒక్కో అడుగు పడుతోంది. మార్చ్ 22వ తేదీన జగన్ విశాఖపట్నంలో గృహప్రవేశం కూడా చేయనున్నారు. ఉగాది నాటికి పూర్తిస్థాయిలో పరిపాలన విశాఖపట్నం నుంచి కొనసాగించేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. సచివాలయాన్ని విశాఖకు తరలించడంలో జాప్యం చేయకూడదని భావిస్తోంది.

జాతీయ స్థాయి సదస్సులు..

జాతీయ స్థాయి సదస్సులు..

ఇప్పటికే- అనధికారికంగా విశాఖపట్నం రాజధాని హోదాను పొందినట్టే కనిపిస్తోంది. సాధారణంగా రాష్ట్ర రాజధానుల్లో ఏర్పాటయ్యే జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులు, వర్క్‌షాప్స్‌ ను విశాఖలో నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగమే జీ20 సమ్మిట్ కూడా. జీ 20 సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 9,10 తేదీల్లో షెడ్యూల్ అయింది.

గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు..

గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు..

ఇందులో భాగస్వామిగా ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, చైనా, జపాన్, ఫ్రాన్స్..వంటి 20 దేశాధినేతలు, ప్రధానమంత్రులు దీనికి హాజరు కానున్నారు. ఈ సదస్సు సన్నాహాక సమావేశాలను విశాఖపట్నంలో నిర్వహించనుంది ప్రభుత్వం. అదే క్రమంలో- అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉద్దేశించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను కూడా విశాఖపట్నంలోనే షెడ్యూల్ చేసింది. మార్చి 3, 4 తేదీల్లో ఈ ఇన్వెస్టర్స్ మీట్ ఏర్పాటు కానుంది.

టయర్ 1 సిటీగా..

టయర్ 1 సిటీగా..

విశాఖపట్నాన్ని రాజధానిగా, టయర్-1 సిటీగా మార్చాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో- రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ఈ మెగా ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రాష్ట్రాభివృద్ధి విషయంలో ఈ అదానీ డేటా సెంటర్ ఓ గేమ్ ఛేంజర్‌గా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ప్రముఖ డేటా సెంటర్ ఆపరేటర్ ఎడ్జ్‌కనెక్స్ జాయింట్ వెంచర్ గా దీన్ని నెలకొల్పనున్నాయి.

జోరుగా సన్నాహాలు..

జోరుగా సన్నాహాలు..

గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సును విజయవంతం చేయడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ సమ్మిట్ కు హాజరు కావాలని కోరుతూ పలువురు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలకూ ఆహ్వానాలను పంపింది. అదే సమయంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌ నాథ్ స్వయంగా ముంబైలో పర్యటిస్తోన్నారు. దేశీయ పారిశ్రామికవేత్తలను కలుసుకుంటోన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు హాజరు కావాలని సాదరంగా ఆహ్వానిస్తోన్నారు.

ముఖేష్ అంబానీ సహా..

ముఖేష్ అంబానీ సహా..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబానీని కలుసుకున్నారు గుడివాడ అమర్ నాథ్. ఆయన నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుకు సంబంధించిన బుక్ లెట్ ను అందజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరించారు. అనంతరం టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, మహీంద్ర అండ్ మహీంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీల అధినేత ఆనంద్ మహీంద్రతో వేర్వేరుగా భేటీ అయ్యారు. పరిశ్రమల శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన ఆయన వెంట ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+