విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విశాఖలో దారుణం: ఎన్ఆర్ఐ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి, దర్యాప్తులో షాకింగ్ విషయాలు

|
Google Oneindia TeluguNews

విశాఖలో ఒక ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద మృతి చెందిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. విశాఖ నగరం మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ లో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. అయితే వీరిని హతమార్చి, సజీవదహనం చేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు.

మంటల్లో సజీవ దహనం అయిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు ..నలుగురు మృతి

మంటల్లో సజీవ దహనం అయిన ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు ..నలుగురు మృతి

మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఎన్ఆర్ఐ కుటుంబం ఎనిమిది నెలలుగా నివసిస్తోంది . అయితే వారి ఇంటి నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల ధాటికి నలుగురు సజీవ దహనం అయ్యారు అని తెలుస్తుంది. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదట దీనిని అగ్ని ప్రమాదంగా భావించినా , తర్వాత రక్తపు మరకలు ఉండటంతో పక్కాగా ప్లాన్ చేసి మరీ చేసిన హత్యలుగా అనుమానించారు.

ఎన్నారై కుటుంబం అనుమానాస్పద మృతిలో షాకింగ్ ట్విస్ట్ .. పెద్ద కుమారుడే హంతకుడు

ఎన్నారై కుటుంబం అనుమానాస్పద మృతిలో షాకింగ్ ట్విస్ట్ .. పెద్ద కుమారుడే హంతకుడు

ఇక ఈ ఘటనలో ఆసక్త్జికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత కొంత కాలంగా వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలో చనిపోయిన వారిని బంగారు నాయుడు, డాక్టర్ నిర్మల, వీరి కుమారులు దీపక్ , కశ్యప్ గా గుర్తించారు. వీరి పెద్ద కుమారుడు దీపక్ మిగతా వారిని చంపి తాను ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఆ క్రమంలోనే సజీవ దహనం చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులో తేల్చారు .

Recommended Video

#Weather Changed Drastically In Paderu Visakhapatnam
కుటుంబ సభ్యులపై పెద్ద కుమారుడు దాడి .. ఆపై సజీవ దహనం

కుటుంబ సభ్యులపై పెద్ద కుమారుడు దాడి .. ఆపై సజీవ దహనం

ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు హత్య చేసి అగ్ని ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని మొదట భావించారు . కానీ సీసీటీవి ఫుటేజీని పరిశీలించిన పోలీసులు కుటుంబ సభ్యులపై పెద్దకుమారుడు దీపక్ దాడి చేసినట్లుగా గుర్తించారు. ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసి, ఆపై దీపక్ సజీవదహనం చేసుకున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీపక్ గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసుపై సి పి మనీష్ కుమార్ సిన్హా మీడియాతో వెల్లడించారు.

English summary
The tragedy took place at Jattada in the Pendurthi zone of Visakhapatnam. The suspicious death of four members of an NRI family has caused a stir locally. The incident in which an NRI family died under suspicious circumstances in an apartment..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X