విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.20 కోట్లు వసూల్ చేయలేదు, చంద్రబాబుపై సంచయిత నిప్పులు, లోకేశ్‌, అశోకపై ఫైర్

|
Google Oneindia TeluguNews

సంచయిత గజపతి, అశోక గజపతి రాజు మధ్య మరో వివాదం నడుస్తోంది. ట్రస్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదనే అంశం మరోసారి అగ్గిరాజేసింది. చంద్రబాబు, లోకేశ్ కూడా స్పందించడంతో.. సంచయిత రంగంలోకి దిగారు. జరిగిన పరిస్థితిని వివరించారు. ట్రస్ట్ ఉద్యోగుల జీతాలు ఆపడం లేదు అని.. కొందరు కావాలనే ఆందోళన చేశారని స్పష్టంచేశారు. అశోక గజపతిరాజుతోపాటు చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు గుప్పించారు.

Recommended Video

Sanchaita Gajapathi Raju On Simhachalam Narasimha Swamy Temple Under 'PRASAD' Scheme

ఇదీ విషయం..

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా, సింహాచల ఆలయ చైర్మన్‌గా సంచయిత బాధ్యతలు స్వీకరించినప్పటీ నుంచి చిన్నాన్న అశోక గజపతిరాజుకు పడటం లేదు. సమయం సందర్భం వస్తే చాలు విరుచుకుపడుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ కింద విద్యాసంస్థలు, ఉద్యోగులు ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అని అశోక గజపతిరాజు ఆరోపించారు. ట్రస్టుకు హుండీలు లేవు అని.. రూ.124 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని.. మరీ జీతాలు చెల్లించడంలో ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించారు. కరోనా వైరస్ సమయంలో జీతాలు చెల్లించాలని ప్రధాని మోడీ చెప్పినా.. ట్రస్ట్ భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తండ్రి పీవీజీ రాజు ప్రజలను విద్యావంతులను చేయాలని భావించారని.. అందుకే విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని వివరించారు. కానీ ప్రస్తుతం జీతాలు ఇవ్వడం లేదని మండిపడ్డారు.

జీతాలు ఇవ్వడం లేదని ఆందోళన..


మరోవైపు తమకు మార్చి నుంచి జీతాలు ఇవ్వడం లేదు అని ఉద్యోగులు శనివారం విజయనగరం కోట ముందు మాన్సాస్ ఉద్యోగులు భిక్షాటన చేశారు. పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిబ్బంది ఆందోళనకు దిగారు. ఆ మరునాడు మాన్సాస్ ట్రస్ట్ స్పందించింది. విజయనగరం కోట వద్ద ఆందోళన చేసింది తమ సిబ్బంది కారు అని పేర్కొన్నది. వారికి ట్రస్ట్‌తో ఏ సంబంధంలేదు అని.. తప్పుడు వార్త ప్రచురితం చేయొద్దని మీడియాను కూడా కోరింది. అయితే దీనిపై అశోక గజపతిరాజుకు మద్దతు చంద్రబాబు, లోకేశ్ కూడా స్పందించారు.

అదేం లేదు.. అసత్య ప్రచారాలు మానుకొండి

సంచయిత స్పందిస్తూ.. ట్రస్ట్ నోట్, ప్రెస్ నోట్‌ను జతపరిచి ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో విలాసవంత భవనంలో ఉంటోన్న పెద్దలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన మహిళపై అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు, లోకేశ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని.. టీడీపీ శ్రేణులతో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదీ సరికాదు.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

రూ.20 కోట్లు ఇప్పించుకోలకపోయారు..

అశోక గజపతిరాజు తప్పుడు విధానాలవల్ల మాన్సాస్ సంస్థలు దెబ్బతిన్నాయని సంచయిత తెలిపారు. విద్యాసంస్థలు రూ.20 కోట్లు బకాయి పడ్డాయని తెలిపారు. 2016 నుంచి అప్పటి సీఎం చంద్రబాబు వసూల్ చేయలేకపోయారని తెలిపారు. ఉన్నత విద్యామండలి అనుమతి లేకుండా 2018-20లో బీకాం, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ ఇచ్చారు. దీంతో విద్యార్థుల డిగ్రీ చెల్లకుండా పోవడంతో.. వారి భవిష్యత్ అంధకారంలో పడింది. సమస్యను తాను అధికారంలోకి వచ్చాక పరిష్కరించానని వివరించారు. అప్పుడు కళ్లు మూసుకొన్న చంద్రబాబు, లోకేశ్.. ఇప్పుడు మంచి జరుగుతోన్న ప్రశ్నించడం భావ్యం కాదన్నారు.

English summary
previous government no collect rs 20 crores to ashoka gajapatiraju.. Sanchaita slams chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X