విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ పథకం చంద్రబాబు మానస పుత్రిక: తనదిగా చెప్పుకొంటోన్న జగన్: గంటా శ్రీనివాస్: వైసీపీతో వైరం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: క్రియాశీలక రాజకీయాలకు చాలాకాలంగా దూరంగా ఉంటూ వస్తోన్న తెలుగుదేశం పార్టీకి చెందిన విశాఖపట్నం నార్త్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్.. ఒక్కసారిగా తెర మీదికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న నాడు-నేడు పథకాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు విమర్శలు సంధించారు. అధికార పార్టీ పట్ల సానుకూలంగా ఉంటోన్నాననే అభిప్రాయాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు.

నాడు-నేడుపై..

నాడు-నేడుపై..

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశను తీసుకుని రావడానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న నాడు-నేడు పథకాన్ని కేంద్రబిందువుగా చేసుకుని గంటా శ్రీనివాస్ విమర్శలు సంధించారు. నిజానికి- ఈ పథకాన్ని తీసుకొచ్చింది టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని స్పష్టం చేశారు. ఆ పథకం ఆయన మానస పుత్రికగా అభివర్ణించారు. దీన్ని వైఎస్ జగన్ తనదిగా చెప్పుకొంటోన్నారని విమర్శించారు. వారి విచక్షణకే వదిలి వేస్తోన్నానని వ్యాఖ్యానించారు.

హెచ్ఏఎం మోడల్ కింద..

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తాను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశానని, అప్పట్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఏఎల్) కింద నిధులను తీసుకొచ్చానని గంటా శ్రీనివాస్ అన్నారు. ఎక్స్‌పర్ట్ కమిటీతో పలు సమావేశాలను నిర్వహించామని గుర్తు చేశారు. నాడు-నేడు పథకానికి రూప కల్పన చేశామని, దీనికి నిధులను తీసుకొచ్చామని పేర్కొన్నారు. దాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారని కూడా వివరించారు.

మూడేళ్లలో దిగజారాయ్..

మూడేళ్లలో దిగజారాయ్..

సమగ్ర విద్యావిధానం, అకడమిక్ కేలండర్‌ను రూపొందించడంతో పాటు వాటిని సమర్థవంతంగా అమలు చేశామని గంటా శ్రీనివాస్ అన్నారు. దానివల్ల అద్భుత ఫలితాలను రాబట్టుకోగలిగామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ మూడు సంవత్సరాల్లో విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. మొన్నటి పదో తరగతి పరీక్ష ఫలితాలు, ఇతర గణాంకాలే దీనికి సాక్ష్యమని గంటా శ్రీనివాస్ పేర్కొన్నారు.

మెగా డీఎస్సీ..

మెగా డీఎస్సీ..

తమ ప్రభుత్వ హయాలో మెగా డీఎస్సీలను నిర్వహించామని ఆయన చెప్పారు. పాఠశాలల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను నియమించామని, విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడానికి అనుక్షణం తపించామని చెప్పారు. దీనికి భిన్నంగా వైసీపీ ప్రభుత్వం రేఫనలైజేషన్ పేరుతో 8,000 పాఠశాలలను మూసివేసిందని మండిపడ్డారు. వైసీపీ అమలు చేస్తోన్నామని చెప్పుకొంటోన్న విద్యా ప్రమాణాల గురించి ఏ ఉపాధ్యాయుడిని అడిగినా చెబుతారని గంటా శ్రీనివాస్ అన్నారు.

రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి..

రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలి..

విద్యా ప్రమాణాలకు సంబంధించిన విషయాల్లో విధాన పరమైన నిర్ణయాలను తీసుకునే సమయంలో ఉపాధ్యాయుల అభిప్రాయాలను తీసుకోవాలని, వారిని భాగస్వామ్యులను చేయాలని గంటా డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఉపాధ్యాయులను అడిగితే సరిపోతుందని అన్నారు. వాళ్లే బహిరంగంగా స్పష్టం చేసినా.. ప్రభుత్వానికి అర్థం కాకపోతే ఈ రాష్ట్రాన్ని దేవుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ప్రకటనను ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

English summary
TDP MLA Ganta Srinivas Rao, who resigned his legislature membership, claims that the Nadu-Nedu scheme implemented by the YS Jagan government, actually brought by the TDP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X