జగన్‌కు జైకొట్టిన విశాఖ టీడీపీ కీలక నేత: ఆ సీట్లపై పట్టు సాధించిన వైసీపీ

YS Jagan: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించిన వేళ.. రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి వలసల సెగ తాకుతోంది. ఈ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి మహాకూటమిగా ఏర్పడిన ఈ మూడు పార్టీల్లో సీట్ల పంపకాల వ్యవహారం చిచ్చు పెట్టింది.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఇమడలేకపోతున్న పలువురు టీడీపీ, జనసేన నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటోన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవలే ఏలూరు జిల్లాకు చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నవుడు వెంకటరమణ అలియాస్ రమణ బాబు.. వైఎస్ఆర్సీపీలో చేరిన విషయం తెలిసిందే.

TDP leader Venkata Ramachandra Rao joined in YSRCP

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువాను కొప్పుకొన్నారాయన. వెంకటరమణ సొంత నియోజకవర్గం.. ఉంగుటూరు. 2019 నాటి ఎన్నికల్లో ఉంగుటూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ సారి ఆయనకు జనసేన నుంచి టికెట్ దక్కట్లేదు. ఫలితంగా వైఎస్ఆర్సీపీలో చేరారు.

తాజాగా విశాఖపట్నానికి చెందిన టీడీపీ సీనియర్‌ నేత గంపల వెంకట రామచంద్ర రావు, ఆయన భార్య సంధ్యా రాణి వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేప‌ల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జ‌గ‌న్‌ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు. వాడబలిజ సామాజికవర్గానికి చెందిన వెంకట రామచంద్రరావుకు విశాఖపట్నం దక్షిణ, విశాఖపట్నం తూర్పు నియోజకవర్గాలపై ఆయనకు మంచి పట్టు ఉంది. టీడీపీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా పనిచేశారు.

TDP leader Venkata Ramachandra Rao joined in YSRCP

అంతకుముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జాయింట్‌ సెక్రటరీగా, ఓబీసీ విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా వ్యవహరించారు. సెన్సార్‌ బోర్డు సభ్యుడు, వైజాగ్ పోర్ట్‌ ట్రస్ట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఇప్పుడాయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ‌ప‌ట్నానికే చెందిన డాక్ట‌ర్ కంచ‌ర్ల అచ్యుత‌రావు వైసీపీలో చేరారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+