విశాఖ గంజాయి దందా : కోటిపైగా విలువైన లిక్విడ్ గంజాయి, తెలంగాణలో 12 కోట్ల గంజాయి సీజ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయింది. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటూ ఇతర రాష్ట్రాలకు గంజాయిని తరలిస్తున్నారు. పోలీసులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడే వారిని పట్టుకోవటం నిత్య కృత్యంగా మారింది .పోలీసులు ఎక్సైజ్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎన్ని తనిఖీలు చేపట్టినప్పటికీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట గంజాయి రవాణా గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. పెద్ద ఎత్తున ఏజెన్సీలో నిఘా పెట్టినప్పటికీ గంజాయి దందా జోరుగానే సాగుతుంది.

విశాఖ ఏజెన్సీలో 25 కేజీల లిక్విడ్ గంజాయి సీజ్


ఎవరికీ దొరకకుండా ఉల్లిపాయల లారీలు, ఆలుగడ్డల లారీలు, బొగ్గు లారీలు, ట్రాలీలు, బైక్ ల మీద కూడా గంజాయి జోరుగా రవాణా అవుతుంది . ఇక రాష్ట్రంలో గంజాయి రవాణా అడ్డుకోవటం పోలీసులకు పెద్ద పనిగా మారింది. ఏజెన్సీ గ్రామాలలో అయితే గంజాయి అక్రమ రవాణా నేపధ్యంలోనే పెద్ద ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లో కేజీ సుమారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే లిక్విడ్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం బైరెడ్డి పాలెం వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా 25 కేజీల లిక్విడ్ గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించారు.

అంతర్జాతీయ మార్కెట్ లో కోటి 25 లక్షల విలువ చేసే గంజాయి

అంతర్జాతీయ మార్కెట్ లో కోటి 25 లక్షల విలువ చేసే గంజాయి

తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయిని సీజ్ చేయడంతో పాటుగా, ఓ వ్యక్తిని అరెస్టు చేసి, అతని బైక్ ను సీజ్ చేశారు. 25 కేజీల లిక్విడ్ గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.ఇది అంతర్జాతీయ మార్కెట్ లో కోటి 25 లక్షల విలువ చేస్తుందని వెల్లడించారు.నర్సీపట్నం లోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడిన ఎక్సైజ్ అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగుల మండలం, కొవరాపల్లి గ్రామం, లంబసింగి పంచాయితీకి చెందిన బయ్యపురెడ్డి సత్యనారాయణ అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నామని, ఇతనితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, వారు పోలీసులను చూసి పరారయ్యారని పేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.

తెలంగాణలో 3,400 కిలోల గంజాయి సీజ్ ..

పట్టుబడిన వ్యక్తి వద్ద సెల్ ఫోన్ కూడా లేకపోవడం వల్ల అతని నుండి సమాచారాన్ని సేకరించటం ఇబ్బందిగా మారుతుందని వెల్లడించారు. ఇక లిక్విడ్ గంజాయి తయారు చేసే యంత్రాన్ని జి.మాడుగుల మండలంలో సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఇంటర్ స్టేట్ గంజాయి స్మగ్లర్లపై నిఘా పెట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముగ్గురు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేసింది. అంబర్ పేట ఓఆర్ఆర్ పై తనిఖీలు చేస్తున్న క్రమంలో భారీగా గంజాయి పట్టుబడింది. ఈడీ అధికారులకు ఎన్సిబి ఇంటిలిజెన్స్ నుండి సమాచారం రాగా టోల్ ప్లాజా వద్ద 140 పూల మొక్కల బ్యాగులలో తరలిస్తున్న 3,400 కిలోల గంజాయిని, గంజాయి తరలిస్తున్నట్రక్ ను సీజ్ చేశారు.

ప్రకాశం జిల్లాలో 24 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు

ప్రకాశం జిల్లాలో 24 లక్షల విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు

ఇదిలా ఉంటే ప్రకాశం జిల్లాలోనూ గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టారు పోలీసులు. ప్రకాశం జిల్లా లో తనిఖీలు చేపట్టిన పోలీసులు భారీగా బంద్ గంజాయిని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు మండలం గంగవరం రోడ్డు లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 300 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ సుమారు 24 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న ఆటో తో పాటుగా, ఓ కారును సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుండి ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

విశాఖ ఏజెన్సీ నుండి ఇతర రాష్ట్రాలకు తరలింపు

విశాఖ ఏజెన్సీ నుండి ఈ గంజాయి బెంగళూరు, మహారాష్ట్ర, గోవాకు సప్లై అవుతున్నట్లుగా గుర్తించామని అధికారులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ మన్యం కేంద్రంగా గంజాయి గుప్పుమంటోంది. ఇతర రాష్ట్రాలకు యథేచ్ఛగా రవాణా అవుతోంది. పోలీసులు ఎంత పటిష్టమైన నిఘా పెట్టినప్పటికీ గంజాయి స్మగ్లర్లు నిత్యం తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక వీరి ఆగడాలకు చెక్ పెట్టడం పోలీసులకు పెద్ద సవాల్ గా మారుతోంది.

Recommended Video

    Araku Valley మండల కేంద్రంలో వాహనదారుల అవస్థలు | Visakhapatnam

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+