విశాఖ ఏజెన్సీలో విషాదం: వాటర్ ఫాల్ వద్ద వెడ్డింగ్ ఫొటోషూట్: ముగ్గురు టీనేజర్లు గల్లంతు
తమ స్నేహితుడి పెళ్లి ఫొటో షూట్ కోసం కొంతమంది యువకులు చేసిన ప్రయత్నాలు.. విషాదాంతమయ్యాయి. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నాయి. విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని తీగలవలస సమీపంలో గల ఓ వాటర్‌ఫాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వాటర్ ఫాల్ వద్ద వారు గల్లంతయ్యారు. అక్కడ ఏర్పడిన ఊబిలో వారు చిక్కుకుని మరణించి ఉంటారని అనుమానిస్తోన్నారు. సమాచారం అందిన వెంటనే హుకుంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను నిరంజన్, వినోద్‌కుమార్, శివనాగేంద్రకుమార్‌గా గుర్తించారు. వారంతా 20 ఏళ్లలోపు వయస్సున్న వారే.
హుకుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్యాసమ్మపాలెం గ్రామానికి చెందిన 10 మంది యువకుల తీగలవలస గ్రామ సమీపంలోని గుడ్డిగుమ్మి జలపాతానికి వెళ్లారు. వెడ్డింగ్ షూట్ కోసం ప్రయత్నించారు. తమ స్నేహితులు ఫొటోలు తీసుకుంటున్న సమయంలో నిరంజన్, వినోద్‌కుమార్, శివనాగేంద్రకుమార్ వాటర్ ఫాల్ వద్ద ఏర్పడిన మడుగులో స్నానం కోసం దిగారు. శివనాగేంద్రకుమార్, నిరంజన్‌కు ఈత రాదు. మడుగులో దిగిన వెంటనే బురదలో చిక్కుకుపోయారు. ఊబిలాంటి ప్రదేశంలో మునిగిపోయారు. వారిని కాపాడటానికి వినోద్ కుమార్ అందులోకి దూకాడు.

వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా మునిగిపోయాడు. మిగిలిన వారి స్నేహితులు ఈ విషయాన్ని గమనించే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందిన వెంటనే పరిసర గ్రామాలకు చెందిన స్థానికులు పెద్ద ఎత్తున గాలించారు. అయినప్పటికీ.. వారి ఆచూకీ దొరకలేదు. హుకుంపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం, టీనేజర్లు కావడం వల్ల సన్యాసమ్మపాలెంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
విశాఖ ఏజెన్సీలో విషాదం: వాటర్ ఫాల్ వద్ద వెడ్డింగ్ ఫొటోషూట్: ముగ్గురు టీనేజర్లు గల్లంతు#Vizag #WATERFALL #weddingphotography pic.twitter.com/qzaMqNu2oQ
— oneindiatelugu (@oneindiatelugu) May 31, 2021
వాటర్ ఫాల్ వద్ద వెడ్డింగ్ ఫొటోషూట్: ముగ్గురు టీనేజర్లు గల్లంతు#Visakhapatnam #WeddingPhotoshoot #Vizag pic.twitter.com/W4WzaAX7Us
— oneindiatelugu (@oneindiatelugu) May 31, 2021
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
ఓపెనర్ గా అభిషేక్ స్థానంలో - ఫైనల్ లో భారీ ట్విస్ట్, ఫలించేనా..!! -
India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..! -
ఫైనల్ మ్యాచ్ వర్షం లో కొట్టుకుపోతే, ఛాంపియన్ ఎవరు - ఐసీసీ తాజా రూల్స్..!! -
కోనసీమ వాసుల కల నెరవేర్చే కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ లో కీలక అడుగు -
LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..! -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications