సర్వాంగ సుందరంగా విశాఖపట్నం- సరికొత్త హంగులతో మెరిసిపోతున్న సాగర నగరం

విశాఖపట్నం: సాగరనగరం విశాఖపట్నం మరో అంతర్జాతీయ సదస్సుకు ఆతిథ్యాన్ని ఇస్తోంది. దీనికోసం ముస్తాబైంది. ఇటీవలే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఏర్పాటయిందిక్కడ. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సుకు దేశీయ పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. ఏపీలో పెట్టబడులను ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలను సైతం కుదుర్చుకున్నారు. వీటి విలువ సుమారు 13 లక్షల కోట్ల రూపాయలు.

ఇక తాజాగా- విశాఖపట్నంలో అదే- జీ20 సదస్సు ఏర్పాటు కాబోతోంది. రేపు, ఎల్లుండి ఈ భేటీ జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న అత్యున్నత స్థాయి సమ్మిట్ ఇది. ఇందులో కీలకమైన ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నంలో సమావేశం కానున్నారు. రెండు రోజుల పాటు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ దేశాలకు చెందిన జీ20 వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యులు విశాఖపట్నానికి రాబోతోన్నారు.

Visakhapatnam

ఈ భేటీ కోసం విశాఖపట్నం ముస్తాబైంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా అధికార యంత్రాంగం.. ఆయా పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. విశాఖలో అన్ని ప్రధాన మార్గాల్లో కొత్త రోడ్లను వేశారు. జీ20 లోగోలను అమర్చారు. నగరంలోని ప్రధాన రహదారులన్నింటినీ విద్యుద్దీపాలతో అలంకరించారు. సాగర తీరంలో ఐ లవ్ వైజాగ్ అనే అక్షరాలను ఏర్పాటు చేశారు. రాత్రివేళ నగరం మొత్తం సరికొత్త అందాలతో మెరిసిపోతూ కనిపించింది.

Visakhapatnam

ఈ సదస్సును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. దీనికోసం ఆయన ఉదయం విశాఖపట్నానికి రానున్నారు. 28వ తేదీన రాత్రి- జీ20 వర్కింగ్ గ్రూప్ కమిటీ సభ్యుల గౌరవార్థం విందును ఏర్పాటు చేశారు. 29వ తేదీన సమావేశం ముగిసిన తరువాత.. రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. 30వ తేదీన జీ20 వర్కింగ్ కమిటీ ప్రతినిధులు విశాఖపట్నంలో పర్యటిస్తారు. పర్యాటక కేంద్రాలను సందర్శిస్తారు.

Visakhapatnam

ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఈ సమ్మిట్‌ను నిర్వహించబోతోంది భారత్. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఇమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్ హాజరు కానున్నారు.

వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు. భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+