visakhapatnam blast : వైజాగ్ టిఫిన్ సెంటర్లో పేలుడు-గోడల ధ్వంసం- గాజువాకలో ఘటన
విశాఖపట్నంలో ఇవాళ ఓ భారీ పేలుడు చోటు చేసుకుంది. నగరంలోని గాజువాక పరిధిలోని ఉన్న ఆటో నగర్‌లో టిఫిన్ సెంటర్ వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి టిఫిన్ సెంటర్‌లోని సామగ్రి మొత్తం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసు జాగిలాలు, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు జరుగుతున్నాయి. భారీ పేలుడుతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

ఉదయం పూట జరిగిన పేలుడు పక్కనే ఉన్న పాన్ షాపులో జరిగినట్లు కొందరు చెప్తున్నారు. అయితే అన్న క్యాంటీన్ పక్కన ఉన్న టిఫిన్ సెంటర్లోనే జరిగిందని మరికొందరు చెప్తున్నారు. ముందు దీన్ని గ్యాస్ సిలిండర్ పేలుడగా భావించినా.. తీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు.
విశాఖ గాజువాకలోని ఓ టిఫిన్ సెంటర్లో పేలుడు..!!#Vizag #Vishakapatnam #AndhraPradesh #ApNews #OneIndiaTelugu pic.twitter.com/Z8mSUDvt24
— oneindiatelugu (@oneindiatelugu) August 18, 2022












Click it and Unblock the Notifications