ప్రేమించానని మోసం: వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి, పెళ్లి చేయాలని పట్టు..
అప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. ప్రేమ పేరుతో మోసం చేసేవారిని చూస్తున్నాం. కానీ యువతీ/ యువకుడు నిరసన చేస్తుంటారు. కొందరు వాటర్ ట్యాంక్ ఎక్కీ మరీ నిరసన తెలియజేస్తారు. అలా విశాఖపట్టణం జిల్లాలో కూడా ఘటన జరిగింది. నర్సీపట్నంలో ఓ యువతీ వాటర్ ట్యాంక్ ఎక్కింది. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ప్రేమించిన యువకుడు మోసం చేశాడని యువతి వాటర్ ట్యాంక్ ఎక్కింది. నర్సీపట్నంలోని ఏరియా ఆసుపత్రి వద్ద గల వాటర్ ట్యాంక్‌ను యువతి ఎక్కింది. తనకు ప్రియుడితో వివాహం జరిపించాలని, లేదంటే దూకుతానని బెదిరించింది. రవి అనే యువకుడిని తాను ప్రేమించానని, అతడు తనను మోసం చేశాడని సదరు యువతి ఆరోపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.

రవితో పెళ్లి చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అయినా కూడా యువతి కిందకు దిగేందుకు నిరాకరించింది. ప్రియుడు రవిని ఇక్కడికి తీసుకొస్తేనే తాను కిందకు దిగుతానని చెబుతుంది. దీంతో పోలీసులు తల పట్టుకున్నారు. తమకు ఈ ప్రేమ గోల ఏంటీ అని అనుకున్నారు. రవిని తీసుకొస్తున్నామని కూడా చెబుతున్నారు. కానీ యువతి బెట్టుచేయడంతో పోలీసులే పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రేమ పేరుతో మోసం చేసే ఘటనలు కొక్కొల్లలు. యువకుడి ఇంటి ముందు ఆందోళన చేసిన ఘటనలు చూశాం.. కానీ ఇక్కడ తనకు పెళ్లి చేయాలని.. తక్షణం తీసుకురావాలని కోరడం డిఫరెంట్. ఆమెను ఒప్పించి.. తీసుకొచ్చేందుకు పోలీసుల తలప్రాణం తోక వరకు వచ్చింది. వద్దు అమ్మ.. దిగు అంటూ తెగ బతిమిలాడారు. తమ వచ్చిన కష్టం ఇతరులకు రావొద్దని అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications