విశాఖకు బీచ్ తెచ్చింది, సబ్ మెరైన్ తెచ్చింది చంద్రబాబే.. విజయసాయి విసుర్లు
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. తన పాలనలో విశాఖకు ఏమీ చేయలేదు అని ధ్వజమెత్తారు. విశాఖ కంటకుడు చంద్రబాబు పార్ట్-8లో సాయిరెడ్డి విరుచుకుపడ్డారు. కుటీర పరిశ్రమలను కాలదన్ని.. కార్పొరేట్ రంగానికి కొమ్ముకాశాడని ఫైరయ్యారు. ఆంధ్రా యూనివర్సిటీలో 14 ఏళ్ల పాలనలో ఒక్క టీచింగ్ అసిస్టెంట్ పోస్టును కూడా భర్తీ చేయలేదని దుమ్మెత్తిపోశాడు.
బీచ్ తెచ్చానని.. సబ్ మెరైన్ కూడా
విశాఖకు బీచ్ తెచ్చానని చంద్రబాబు చెప్పుకుంటారని విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. సబ్ మెరైన్ కూడా తన ఘనతేనని బీరాలు పలుకుతారని చంద్రబాబుని ఏకీపారేశారు. విశాఖ జిల్లాలో నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోగా.. పేదలను పరిహసించాడని మండిపడ్డారు. విశాఖ నుంచి వచ్చిన ఆదాయంలో నాలుగోవంతు కూడా ఖర్చు చేయని ఘనుడు చంద్రబాబు అని మండిపడ్డారు. కానీ విశాఖ నగర ఆదాయాన్ని మాత్రం ఇతర చోటకు మళ్లించాడని తెలిపారు. విశాఖలో తనవారు లేరని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెట్రో రైలును ఇతర ప్రాంతానికి మళ్లించాలని అనుకున్నాడని ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

మెట్రో రైలును మళ్లించే యత్నం.. ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద నగరం విశాఖ అని.. అందుకే మెట్రో రైలును కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. విశాఖకు కేంద్రం చేయాలనుకున్న అభివృద్ధిని కూడా సైంధవునిలా చంద్రబాబు అడ్డుకున్నాడని విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ విమ్స్ , మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేవరకు కేజీహెచ్ తప్ప వేరే పెద్దాసుపత్రే లేదని గుర్తుచేశారు. విద్యాభివృద్ధి కోసం కూడా ఏమీ చేయలేదని మండిపడ్డారు. ఉన్న స్కూల్స్, కాలేజీలు ఎత్తేశాడని ధ్వజమెత్తారు.

ఒక్క పర్మినెంట్ పోస్టు కూడా లేదు..
ఆంధ్రా వర్సిటీని భ్రష్టుపట్టించారని.. వర్సిటీకి చెందిన భూములను అనుయాయులకు దానం చేశాడని ఆరోపించారు. వర్సిటీలో ఒక్క పర్మినెంట్ పోస్టు భర్తీ చేయలేదని.. వేకెన్సీ ఉన్నా టీచింగ్ ఫ్యాకల్టీని నియమించలేదన్నారు. కేఏ పాల్‌ను అడ్డు పెట్టుకుని వైసీపీని దెబ్బతీయాలని అనుకున్నాడని ఆరోపించారు. విశాఖ జిల్లాలో క్రిస్టియన్ ఓట్ల కోసం కేఏ పాల్ సాయంతో ప్రజలను విడదీయాలని అనుకున్నాడని వివరించారు. కానీ విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఓటర్లు అతని ఆటలను సాగనీయలేదని చెప్పారు.
Recommended Video

కాపులకు, మత్య్సకారులకు ద్రోహం..?
విశాఖ జిల్లా..ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గం కాపులను అణగదొక్కాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కానీ మత్స్యకారుడిని విశాఖ మేయర్ చేసిన ఘనత వైఎస్ఆర్‌కే దక్కుతుందని చెప్పారు. విశాఖలో విధ్వంసం సృష్టించి మత్సకారుల పొట్టకొట్టిన ఘనత మాత్రం చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. జిల్లాలోని ఏటి కొప్పాకలో బొమ్మల తయారీ పరిశ్రమను ధ్వంసం చేసింది చంద్రబాబు అని ఫైరయ్యారు.
-
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications