లోకసభ ఎన్నికలు 2019 : విజయనగరం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

Recommended Video

    Lok Sabha Election 2019:Vizianagaram Lok Sabha Constituency, Sitting MP, MP Performance Report

    విజయనగరం జిల్లా.... సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు వేదికగా భాసిల్లిన విజయనగరం జిల్లాకు చార్రికత ప్రాధాన్యం ఉంది. పూసపాటి రాజ వంశీయులు పాలించిన విజయనగరం పూర్వం కళింగ రాజ్యంలో అంతర్భాంగా ఉండేది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కళింగ రాజ్యం అటు కటక్ నుంచి ఇటు పిఠాపురం వరకు విస్తరించి ఉండేది. ప్రస్తుతం ఉత్తర కళింగ భాగం ఒడిశాలో, దక్షిణభాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. సందర్శకులను ఆకర్షించే అందాలెన్నో విజయనగరం జిల్లా సొంతం. జలసిరితో అలలారే తాటిపూడి జలాశయంలో బోటు షికారు, పర్యాటకులకు ప్రశాంతతనిస్తూ చింతపల్లి వద్ద సాగరతీరం, పకృతి ప్రేమికులను ఆకర్షించే తోటపల్లి బ్యారేజి, కురుకూటి, దండిగాం జలపాతాలు... ఇలా ఒకటా రెండా విజయనగరం నిండా అందాలే అందాలు.

    ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంటు స్థానాల్లో విజయనగరం లోక్‌సభ స్థానం ఒకటిగా ఉంది.ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గాలు ఉన్నాయి. 2008 పునర్వ్యవస్థీకరణ తరువాత దీనిని కొత్తగా ఏర్పాటుచేశారు. ఇందులో ఎచ్చెర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.ఇప్పటి వరకు విజయనగరం పార్లమెంటు స్థానానికి రెండు సార్లు ఎన్నికలు జరిగాయి. 2009, 2014లో విజయనగరం పార్లమెంటు స్థానానికి ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ గెలుపొందగా టీడీపీ అభ్యర్థి అప్పలనాయుడు కొండపల్లి రెండో స్థానంలో నిలిచారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజు తన సమీప వైసీపీ అభ్యర్థి వీఎస్‌సీకేకే రంగారావుపై విజయం సాధించారు.

    #LokSabhaElection2019: All about Vizianagaram Constituency

    ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టిన అశోక్ గజపతి రాజు ఇప్పటి వరకు ఎలాంటి చర్చలో పాల్గొనలేదు. అయితే ఆయన లోక్‌సభ హాజరు మాత్రం 100శాతంగా ఉంది. బీజేపీతో కలిసి ఉన్న సమయంలో కేంద్ర మంత్రిగా కూడా అశోక్ గజపతి రాజు బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ప్రభుత్వం తరపున చర్చలో పాల్గొన్నారు.అంతేకాదు హాజరు పట్టికలో కూడా ఆయన సంతకం చేయవలసిన పని లేదు. మరోవైపు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రైవేట్ బిల్లులు ప్రవేశ పెట్టే వీలు లేదు. ఇక 2014 ఎన్నికల్లో విజయనగరం పార్లమెంటు స్థానంలో ఉన్న 1,404,127.

    ఇందులో పురుష ఓటర్లు 7,00,837 మంది ఉండగా... మహిళా ఓటర్లు 703,290 ఉన్నారు. మొత్తంగా 11,20,316 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 80శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో అశోక్ గజపతి రాజుకు 5,36,549 ఓట్లు రాగా తన సమీప వైసీపీ ప్రత్యర్థి రంగారావుకు 4,29,638 ఓట్లు వచ్చాయి. మొత్తానికి 1,06,911 ఓట్ల మెజార్టీతో అశోక్ గజపతిరాజు విజయం సాధించారు. అయితే ఈసారి అంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయనగరంలో టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీ పుంజుకోవడం లాంటి అంశాలు అశోక్ గజపతి రాజుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+