విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.55 లక్షలు మిస్సింగ్.. ఎదురింటి వారిపై అనుమానం.. అక్కడ ఎవరు ఉంటారంటే..

|
Google Oneindia TeluguNews

ఒక్కటి కాదు రెండు కాదు రూ.55 లక్షలు కనిపించలేదట. ఇంకేముంది పోలీసులను ఆశ్రయించాడు. వారు కూడా ఆగమేఘాల మీద దర్యాప్తు చేశారు. అతను బెడ్‌రూమ్‌లో నగదు పాటిపెట్టడట. క్లూస్‌టీమ్‌ కూడా రంగంలోకి దింపారు. డాగ్‌స్వాడ్ రావడంతో పని ప్రారంభించారు. ఇంట్లో పలు చోట్ల తవ్వకాలు జరిపారు, సోదాలు చేశారు. ఇంట్లో ఎక్కడ డబ్బు ఆనవాళ్లు కనిపించలేదు. ఏం చేయాలా అని ఆలోచించారు.

తనిఖీలు చేపట్టగా.. అక్కడ రూ.19 లక్షలు దొరికాయి. ఆ డబ్బు దొరకగానే సమస్య తాము పరిష్కరించుకుంటామని ఇక మీరు వెళ్లొచ్చని పోలీసులకు సెలవిచ్చాడుని. దీంతో పోలీసులు వెనుదిరిగారు. విజయనగరం జిల్లా భీమిలి జోన్ రెండో వార్డులోని మేడ చిన్నారావు అలియాస్‌ గురుమూర్తి ఇంట్లో జరిగింది. గురుమూర్తి కర్రపెండలం వ్యాపారం చేస్తారు. ఈ ఏడాది మార్చిలో గణపతినగరం వద్ద తనకున్న భూమిని రూ.75 లక్షలకు విక్రయించాడు. అందులో రూ.20 లక్షలను బంధువులకు చెల్లించి మిగిలిన రూ.55 లక్షలను ఇంట్లో గొయ్యి తీసిపాతిపెట్టారు.

rs.55 lakhs missing at vizianagaram

ఈ నెల 17వ తేదీ గురుమూర్తి ఇద్దరు కొడుకులు, కోడళ్ళు ఇంటికి వచ్చారు. ఇదే సమయంలో డబ్బు పాతిపెట్టిన దగ్గర కొత్తగా సిమెంట్ వేసినట్లు కనిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూశారు. అయితే గోతిలో డబ్బు కనిపించలేదు. దీంతో ఇళ్లంతా జల్లెడపట్టారు. ఎక్కడ డబ్బు ఆనవాళ్లే లేవు. రూ.55 లక్షల డబ్బు పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సోదాలు నిర్వహించారు. ఎదురింట్లో తవ్వకాలు చేపట్టగా రూ.19 లక్షల నగదు దొరికింది.. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఎదురింటిలో ఉంటున్నది గురుమూర్తి ఇద్దరు కుమారులే కావడం విశేషం. దీంతో సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు.

ఎందుకంటే కొడుకులే దొంగ అని తెలిస్తే బాగుండదు అనుకున్నాడు. అందుకే ఇంకా నగదు లెక్క తేలాల్సి ఉన్నా.. పోలీసులను పంపించేశాడు. రూ.36 లక్షల నగదును తన కుమారులే తీసి ఉంటారని నిర్ధారణకు వచ్చాడు. విషయం క్లారిటీ రావడంతో.. పోలీసుల జోక్యం వద్దనుకున్నాడు. సొంత కుమారులపై అపవాదు తీసుకురావడం ఇష్టం లేదు. అందుకే సైలంట్‌గా ఉండిపోయాడు.

English summary
rs.55 lakhs missing at vizianagaram district bheemili. gurumurthy sons is the culprit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X