వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డల్లాస్ నగరమా వరంగల్ ... గుంతల రోడ్లకు పుష్పాభిషేకం చేసి బీజేపీ వినూత్న నిరసన !!

|
Google Oneindia TeluguNews

వరంగల్ మహానగరంలో బిజెపి వినూత్న నిరసనకు దిగింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వరంగల్ నగర జీవనం అస్తవ్యస్తంగా మారింది. నగర రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా రోడ్లపై గుంతలు, వరద నీరు దర్శనమిస్తున్న సమయంలో టిఆర్ఎస్ పాలనను ప్రశ్నించేందుకు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది బిజెపి. ఇందులో భాగంగా వరంగల్ చౌరస్తా నుండి వరంగల్ బస్ స్టాండ్ వరకు వెయ్యి కిలోల పువ్వులతో గుంతల రోడ్లకు పుష్పాభిషేకం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.

వరంగల్లో బీజేపీ వినూత్న నిరసన .. గుంతల రోడ్లకు పుష్పాభిషేకం

వరంగల్లో బీజేపీ వినూత్న నిరసన .. గుంతల రోడ్లకు పుష్పాభిషేకం


గుంతల రోడ్లకు పూలతో అభిషేకం చేస్తూ బిజెపి నాయకులు తమ నిరసనను తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ టిఆర్ఎస్ ప్రభుత్వ పాలన పై ధ్వజమెత్తారు. వరంగల్ నగరాన్ని డల్లాస్ నగరంలా మారుస్తానని 6 సంవత్సరాల క్రితం వరంగల్ నగర పర్యటనలో చెప్పిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ మాటలను డ్రైనేజీలో కలిపారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కొరకు ఇచ్చిన స్మార్ట్ సిటీ నిధులను కమిషన్ల కొరకు స్వాహా చేసి కాకతీయుల రాజ్యాన్ని కంపులో ఉంచుతున్నారు అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

వరంగల్ చౌరస్తా నుండి బస్సు స్టాండ్ వరకు అధ్వాన్నంగా పైప్ లైన్ పనులు

వరంగల్ చౌరస్తా నుండి బస్సు స్టాండ్ వరకు అధ్వాన్నంగా పైప్ లైన్ పనులు


వరంగల్ అభివృద్ధిని అధికార టిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అటకెక్కించారు అని మండిపడ్డారు బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ . వరంగల్ చౌరస్తా నుండి బస్సు స్టాండ్ వరకు చేస్తున్న డ్రైనేజీ ల పైప్ లైన్ పనులు గత ఆరు నెల్లలుగా నత్తనడకన సాగుతున్నాయని, దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ద్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు కబ్జాలు, కమిషన్ల పై ఉన్న శ్రద్ధ ప్రజల కష్టాలు, పట్టణ అభివృద్ధిపై లేదని మండిపడ్డారు.

Recommended Video

Lunar Eclipse 2021 : Blood Moon Supermoon తొలిసారి.. 14 నిమిషాలు మాత్రమే || Oneindia Telugu
నగర ప్రజల నడుములు విరుగుతున్నా పట్టింపు లేదని ఫైర్

నగర ప్రజల నడుములు విరుగుతున్నా పట్టింపు లేదని ఫైర్

నగరంలో అస్థవ్యస్థనంగా ఉన్న రోడ్ల పై ప్రయాణిస్తూ నగర ప్రజల నడుములు విరుగుతున్నా, అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వం, పాలకులు నిమ్మకు నీరెత్తిన్నట్టు వ్యవహరిస్తున్నారు అని ఆరోపించారు. వెంటనే వరంగల్ రోడ్లను అభివృద్ధి చేయకుంటే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని రావు పద్మ హెచ్చరించారు. బిజెపి నాయకులు నిర్వహించిన ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ తో పాటుగా, కార్పొరేటర్ చింతాకుల అనిల్, బిజెపి నాయకుడు గంటా రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు.

English summary
The BJP staged an innovative protest in the Warangal. Life in Warangal has become chaotic with heavy rains over the last two days. City road are like ponds. The BJP has launched an innovative program to question the TRS rule. As part of this, a protest was organized from Warangal Chowrasta to Warangal bus stand in the name of flower anointing to the potholes roads with one thousand kilos of flowers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X