వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కడ నకిలీల మాయాజాలం: ఫేక్ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ వి.ఏ.ఓ అరెస్ట్!!

|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల కాలంలో వరుసగా నకిలీ దందాలకు పాల్పడుతున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేస్తున్న మాజీ వి.ఏ.ఓ తో పాటు, అతనితో కలిసి ఈ దందా లో పాలుపంచుకున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసీఆర్ చెప్పింది చేస్తే ఇరుక్కుంటామా? మల్లారెడ్డి ఎపిసోడ్ తో గులాబీ నేతల్లో అంతర్మధనం!!కేసీఆర్ చెప్పింది చేస్తే ఇరుక్కుంటామా? మల్లారెడ్డి ఎపిసోడ్ తో గులాబీ నేతల్లో అంతర్మధనం!!

నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేసే వ్యక్తులు అరెస్ట్

నకిలీ రెవెన్యూ పత్రాలను తయారు చేసే వ్యక్తులు అరెస్ట్


వరంగల్ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ మరియు నెక్కొండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో వి.ఏ.ఓగా పదవి విరమణ చేసిన రెవెన్యూ విభాగంలో పనిచేసిన అనుభవంతో ఈజీగా డబ్బు సంపాదించడం కోసం నకిలీ రెవెన్యూ పత్రాలను సృష్టిస్తున్న మాజీ వి.ఏ.ఓ వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి చెందిన 70ఏళ్ళ మద్ది వెంకటరెడ్డి తో పాటు 50ఏళ్ళ కల్వచర్ల రఘును అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు, ఆర్టీఓకు సంబంధించిన సకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్, 130 మరియు సి ఫారాలు, తహసీల్దార్, ఆర్టీవో అధికారులకు సంబంధించిన నకిలీ ముద్రణలు, పహాణీలు, కొటేషన్లు, బ్యాంకు చాలాన్లు, గ్రామ నక్షాలు, స్టాంపు పేపర్లను పోలీసులు విశ్రాంత వి.ఏ.ఓ ఇంటినుండి స్వాధీనం చేసుకున్నారు.

ఈజీగా డబ్బు సంపాదించటం కోసంనకిలీ రెవెన్యూ పత్రాల తయారీ

ఈజీగా డబ్బు సంపాదించటం కోసంనకిలీ రెవెన్యూ పత్రాల తయారీ


ఈ అరెస్ట్లకు సంబంధించి అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ వివరాలను వెల్లడిస్తూ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడైన మద్ది వెంకటరెడ్డి 1973 సంవత్సరం నుండి 2012 వరకు రెవెన్యూ విభాగంలో పట్వారీ, పంచాయితీ కార్యదర్శి, విఏఓ గా నెక్కొండ, పర్వతగిరి మండలాల్లో పనిచేసి పదవివిరమణ పోందాడు. కాని నిందితుడికి పదవీవిరమణ తరువాత డబ్బుపై వ్యామోహం పోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలకున్నాడు. తాను రెవెన్యూ విభాగంలో సుధీర్ఘకాలం పని చేసిన అనుభవంతో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు, ఆర్టీఓకు సంబంధించిన నకిలీ ల్యాండ్ కన్వర్జేషన్ ప్రొసీడింగ్స్,13జి మరియు సి ఫారాలు తయారీకి తెర తీసాడు.

నకిలీ పత్రాలతో బ్యాంకుల నుండి రుణాలకు సహాయం

నకిలీ పత్రాలతో బ్యాంకుల నుండి రుణాలకు సహాయం


ఈ విధంగా తయారు చేసిన నకిలీ పాస్ పుస్తకాలు, పత్రాలపై మరో నిందితుడై కల్వచర్ల రఘుతో తహసిల్దార్ మరియు ఆర్టీఓ సంతాకలను ఫోర్జరీ సంతకాలు చేసేవాడు. ఈ విధంగా సృషించిన నకిలీ రెవెన్యూ పత్రాలు అవసరమున్న వ్యక్తులకు అందజేసే నిందితులు సొమ్ము చేసుకునేవారు. ఈ విధంగా నకిలీ రెవెన్యూ పట్టదారు పాస్ బుక్ లు, పత్రాలను పొందిన వ్యక్తులు బ్యాంకుల నుండి రుణం పొందేవారు. ఈ వ్యవహరంపై అధికారులకు సమాచారం రావడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నిందితులు పాల్పడిన నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ ఇద్దరూ నిందితులపై నెక్కొండ, పర్వతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినట్టు అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ తెలిపారు.

English summary
The police arrested another person along with the former VAO who was making fake revenue documents in Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X