వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వరంగల్ తూర్పు టార్గెట్ గా రంగంలోకి కొండా దంపతులు

|
Google Oneindia TeluguNews

నిన్నటి దాకా సైలెంట్ అయిన కొండా దంపతులు మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో రంగంలోకి దిగుతున్నారా ? కాంగ్రెస్ పార్టీ నేతలుగా పార్టీ గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారా? వరంగల్ తూర్పులో గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన సురేఖ మరోమారు వరంగల్ తూర్పును టార్గెట్ చేశారా ? టీఆర్ఎస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో దీటుగా ఎదుర్కోబోతున్నారా? అంటే అవును అనే చెప్పాలి.

పార్టీ మారే ఆలోచనలో కొండా దంపతులు ? .. బీజేపీలోకి జంప్ అంటూ ప్రచారం పార్టీ మారే ఆలోచనలో కొండా దంపతులు ? .. బీజేపీలోకి జంప్ అంటూ ప్రచారం

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కు షాక్ ఇవ్వనున్న కొండా దంపతులు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ కు షాక్ ఇవ్వనున్న కొండా దంపతులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగిన నేపధ్యంలో అన్ని పార్టీలు ఇప్పటి నుండే కసరత్తులు పెట్టాయి. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సన్నద్ధం అవుతున్నాయి. ఇక గత ఎన్నికల్లో పరకాల నుండి బరిలోకి దిగి ఓటమి పాలైన కొండా సురేఖ ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి ధిక్కార స్వరం వినిపించిన కొండా దంపతులు త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల నేపధ్యంలో వరంగల్ తూర్పును టార్గెట్ చేశారు.

మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా మురళి

మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కొండా మురళి

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే , మాజీ మేయర్ నరేందర్ పై గతంలో టీఆర్ ఎస్ లో ఉన్న సమయంలోనే నిప్పులు చెరిగిన కొండా దంపతులు ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లో నరేందర్ కు షాక్ ఇవ్వాలని పావులు కదుపుతున్నారు. కాశీబుగ్గలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కొండా మురళి రానున్న మున్సిపల్ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ధిక్కార స్వరం వినిపించి టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న కొండా దంపతులు ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఓటమితో సైలెంట్ అయ్యారు .

 మున్సిపల్ బరిలోకి అభిమానులు , అనుయాయుల కోసమే అన్న కొండా

మున్సిపల్ బరిలోకి అభిమానులు , అనుయాయుల కోసమే అన్న కొండా


గతంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు సురేఖ . ఇక తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ వర్సెస్ ప్రస్తుత ఎమ్మెల్యే , మాజీ మేయర్ నన్నపునేని నరేందర్ వార్ చాలా కాలంగా కొనసాగుతుంది. ఇక ఈ నేపధ్యంలో తూర్పు నియోజక వర్గంలో పర్యటించిన మురళి తమ అభిమానులు తూర్పు నియోజకవర్గంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి కోసం తూర్పు నియోజకవర్గంలో రంగంలోకి దిగుతున్నామని ప్రకటించారు. తూర్పులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరి డివిజన్లో వారికే కమిటిలు వేస్తామని కచ్చితంగా టీఆర్ ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి తీరతామని కొండా మురళి పేర్కొన్నారు.

 23 డివిజన్లలో తమ వర్గాన్ని నిలబెట్టి కార్పోటర్లుగా గెలిపిస్తామన్న కొండా

23 డివిజన్లలో తమ వర్గాన్ని నిలబెట్టి కార్పోటర్లుగా గెలిపిస్తామన్న కొండా

రాబోయే మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో తూర్పులో 23 డివిజన్లలో తమ వర్గాన్ని నిలబెట్టి కార్పోటర్లుగా గెలిపించుకుంటామని మురళి పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు చాలా మంది మా ఇంటికి వచ్చి బాధలు చెప్పుకుంటున్నారన్న మురళి తూర్పు నియోజకవర్గాన్ని ఇక ముందు విడిచిపెట్టేది లేదన్నారు. కొండా సురేఖ వరంగల్ తూర్పులో కార్యక్రమాలు నిర్వహిస్తారని తాను భూపాలపల్లి జిల్లాను చూసుకుంటానని చెప్పారు కొండా మురళి . రానున్న ఎన్నికల్లో పాత పద్దతిలోనే కార్పోరేటర్లను గెలిపించుకుంటానని ఆయన పేర్కొన్నారు.

English summary
In the upcoming municipal elections in the state, Konda Murali said that in the upcoming municipal corporation elections, he will win corporators in the 23 divisions of the Warangal East . Konda Murali said he would take care of the Bhupalapalli district where Konda Surekha would be performing in the Warangal East. He said the corporators would win the next election in the old fashioned way in Warangal east .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X