ఎమ్మెల్యే సీతక్క వాహనం ఢీకొని చిన్నారి మృతి .. తల్లిదండ్రులకు గాయాలు
ములుగు నియోజకవర్గ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు సీతక్క వాహనం ఢీకొని ఓ చిన్నారి మరణించింది. సీతక్క కారు బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పప్కాపురం మూలమలుపు వద్ద ములుగు ఎమ్మెల్యే సీతక్క వాహనం బైక్ ను ఢీ కొట్టింది. జీడివాగు వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు మూడేళ్ల చిన్నారి. ఇక ఈ ప్రమాదంలో చిన్నారితో పాటు బైక్ మీద ప్రయాణం చేస్తున్న తల్లిదండ్రులు గాయపడ్డారు.


ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన సీతక్కవాహనం దిగి అక్కడే ఉండి గాయపడినవారిని వేరే వాహనంలో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన చిన్నారి తల్లిదండ్రులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు వెళ్లి సీతక్క వారి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ఘటనలో బైక్ దాదాపుగా నుజ్జు నుజ్జు అయింది. సీతక్క కారు ముందు భాగం ధ్వంసమైంది.












Click it and Unblock the Notifications