వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. ఊడిన స్కూల్ పైకప్పు.. విద్యార్థినిలకు గాయాలు.. ఎక్కడంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వల్ల రెండేళ్ల పాటు సరిగా స్కూళ్లే నడవలేదు. ఇంకెముంది.. వాటి బాగోగులు... అంటే పురాతన స్కూల్స్ గురించి పట్టించుకున్న నాథుడే లేడు. ప్రైవేట్ అంటే సొంత భవనం ఉన్న వారు కాస్త శ్రద్ద కనబరుస్తారు. మిగతావారికి అంటే.. ప్రభుత్వ బడులను పట్టించుకునేది ఎవరు... టీచర్లు అంటారా.. వస్తారు, పోతారు తప్ప చేసేదేమీ ఉండదు. పెద్దగా పట్టించుకోరు.. అందుకే ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా సందర్భాల్లో విద్యార్థులు కూడా గాయపడ్డారు. అయినప్పటికీ మన అధికారుల్లో చలనమే లేదు. ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ స్కూల్లో పైకప్పు పెచ్చులు పడి ఊడింది. దీంతో కొందరు విద్యార్ధినిలు గాయపడ్డారు. హన్మకొండ జిల్లాలో గల హసన్‌పర్తి జడ్పీ హైస్కూల్‌లో స్కూల్ క్లాస్ రూమ్‌లో పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. విద్యార్థినిలు గాయపడ్డారు. పదో తరగతి విద్యార్థులు ఉన్న గదిలోని పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటం వల్ల ఐదుగురు విద్యార్థినులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని పాఠశాల యాజమాన్యం స్థానిక ఆస్పత్రికి తరలించింది. స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

roof top falls into students at hasanparthy zp high school

స్కూల్‌లో జరిగిన ఘటనపై విద్యార్ధులు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు పరుగులు తీశారు. గాయపడిన విద్యార్థినుల తల్లిదండ్రులు.. వారి పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. స్కూల్ పరిస్థితి ఇలా ఉంటే ఎప్పుడు ఏం జరుతుందోనని భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

కరోనా వల్ల దాదాపు స్కూల్స్ సరిగా నడవలేదు. ఇటీవల స్టార్ట్ అయ్యాయి. అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే జరిగిన కొన్నిచోట్ల సరయిన ప్రీకాషన్స్ తీసుకుని ఉంటే బాగుండేది. అలా జరగకపోవడంతో ఇలా ప్రమాదాలు జరిగి.. విద్యార్థులు గాయపడుతున్నారు. మరమ్ముతు ఉన్న చోట వెంటనే చేయిస్తే బాగుండేది.. లేదంటే ఇలాంటి ఘటనలు తప్పడం లేదు. సో ఇకనైనా మిగతా వారు అలర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదాలు తప్పవు.

English summary
roof top falls into the students. incident happen at hasanparthy zp high school in hanamakonda district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X