వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బండి సంజయ్ అరెస్ట్.. సునీల్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా..

|
Google Oneindia TeluguNews

విద్యార్థి సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు బండి సంజయ్ బయల్దేరారు. మంథని నుంచి మహబూబాబాద్ బయలుదేరిన ఆయననును పోలీసులు అరెస్ట్ చేశారు. భూపాలపల్లి అడవి వద్ద బండి సంజయ్‌తోపాటు వివేక్ వెంకటస్వామి, బొడిగె శోభ, దుగ్యాల ప్రదీప్, కీర్తిరెడ్డిను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నేతల అరెస్ట్‌లకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాధల్లో ఉన్న కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్తే అడ్డుకుంటారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రశ్నిస్తే దాడులు చేయడం, అక్రమ అరెస్టులకు పూనుకోవడం దుర్మార్గపు చర్యని సంజయ్ విమర్శించారు.

telangana bjp president bandi sanjay arrested

కాకతీయ వర్సిటీకి చెందిన సునీల్ నాయక్ అనే విద్యార్థి ఉద్యోగాల భర్తీ అంశం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడు. సునీల్ నాయక్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు మంథని నుంచి మహబూబాబాద్ వెళుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. సర్కారు దుర్మార్గానికి ఇది నిదర్శనం అని పేర్కొంది.

English summary
telangana bjp president bandi sanjay arrested at bhupalapally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X