అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు.. మహా చోర ప్రవీణుడు!!
డబ్బు, నగల కోసం ఓ తమ్ముడు స్వయానా అన్నింటికే కన్నం వేశాడు. అన్న కుటుంబం అంతా ఊరికి వెళ్ళిందని గమనించి అన్న ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. ఆపై తనకేమి తెలియదు అన్నట్టు ఎంత అమాయకంగా నటిస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసినా నిందితుడు తీరుతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన మండల రవి రోజువారీ కూలి పనులు చేసుకుంటూ వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో నిందితుడికి బాగా అప్పులయ్యాయి. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఇదే గ్రామంలో నిందితుడి అన్న అయిన సుధాకర్ ఇంట్లో పెళ్లి జరిగింది. అన్న కుమారుడు వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. దీంతో ఇంట్లో డబ్బు, నగలు ఉన్నాయి.

మరోవైపు మండల రవి చేసిన అప్పుల తాలూకా అప్పుల వాళ్ళు, డబ్బు చెల్లించాలని రవిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో నిందితుడు తన అన్న ఇంట్లో ఎక్కువ డబ్బులు, నగలు ఉంటాయని ఆలోచించి వాటిని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ చేసాడు. అదను కోసం వేచి చూసిన అతనికి ఈనెల 26వ తేదీ సాయంత్రం నిందితుడి అన్న కుటుంబం వేములవాడకు వెళ్లడం అతని ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి కలిసి వచ్చింది. దీంతో ఇదే అదునుగా భావించిన నిందితుడు అన్న ఇంటి ఉత్తర ద్వారం తలుపులు తొలగించి, బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారాన్ని డబ్బును చోరీ చేశాడు.
మొత్తం నిందితుడు 75 గ్రాముల బంగారు ఆభరణాలు, లక్ష నలభై వేల రూపాయల నగదును చోరీ చేశాడు. ఇక ఆపై అన్న ఇంటి ఉత్తర ద్వారం తలుపులు పగలగొట్టారని బాధితుడికి, తల్లికి సమాచారం అందించాడు. దీంతో వేములవాడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలో బాధితుడి తమ్ముడు పై పోలీసులకు అనుమానం రాగా, అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఆ సమయంలో తమ్ముడు ఎక్కడ ఉన్నాడు అన్నది, సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసి గుర్తించారు. ఆపై తమ్ముడే అన్న ఇంటికి కన్నం వేసిన దొంగగా గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేసి, అతను చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్వయాన అన్న ఇంటిలోనే చోరీకి పాల్పడిన తమ్ముడిని ఇరువై నాలుగు గంటల్లోపు చెన్నారావుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను వరంగల్ ఈస్ట్ జోన్ డిసిపి అభినందించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications