పశ్చిమగోదావరి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వావ్.. ఎమ్మెల్యే చొరవ భేష్.. కైలాసరథం నడిపిన నిమ్మల.. ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

చిన్నపాటి నేతల బిల్డప్ చూడలేం.. ఎమ్మెల్యే అంటే ఓ రేంజ్.. మంది మార్బలంతో వెళుతుంటారు. ఎవరో ఒకరు అరుదుగా మాత్రమే.. సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. వారికి చాలా మంచి పేరు కూడా వస్తోంది. అయితే టీడీపీ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వార్తల్లో నిలిచారు. ఈ సారి ఆయన చేసిన మంచి పని పలువురికి ఆదర్శంగా నిలించింది.

శ్మశానాలకు మృతదేహాలను తరలించే కైలాస రథానికి డ్రైవర్‌గా నిమ్మల రామానాయుడు మారారు. ఆకస్మికంగా గుండెపోటుతో ఒకరు మరణించారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు రామానాయుడు తీసుకెళ్లారు. కైలాస రథం నడిపే డ్రైవర్‌కు కోవిడ్ పాజిటివ్ రావడంతో అతను డ్యూటీకి రాలేదు. కైలాస రథం నడిపేందుకు వేరే డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎమ్మెల్యేనే వాహనం నడపాల్సి వచ్చింది. మిగతా వారికి రోల్ మోడల్‌గా నిలిచారు.

mla nimmala ramanaidu drive kailasa ratham vehicle

విషయం తెలిసి ఎమ్మెల్యే నిమ్మల స్వయంగా రంగంలోకి దిగారు. కైలాస రథం సేవలకు ఆటంకం కలగకూడదని డ్రైవర్లలో స్ఫూర్తి నింపడానికి డ్రైవర్‌గా మారారు. సాటి మనిషిని ఆదుకోవడం, చనిపోయిన వ్యక్తికి సేవ చేయడం పుణ్యమని ఆయన చెబుతుంటారు. మానవ ధర్మాన్ని అందరూ పాటించాలని నిమ్మల రామానాయుడు తెలిపారు. మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించడమే కాదు అంత్యక్రియల్లో కూడా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

Intranasal Covid Vaccine,మరింత బూస్టర్..! || Oneindia Telugu

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

English summary
tdp mla nimmala rama naidu drive kailasa ratham vehicle. one person dead due to heart stroke. vehicle driver infected coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X