అల్లూరి స్ఫూర్తిదాయకం - ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి : తెలుగు వీర లేవరా..అంటూ ప్రధాని..!!
తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా... అంటూ అచ్చతెలుగులో తొలిపలుకులు పలికిన ప్రధాని మోదీ అల్లూరిని ఘన నివాళి అర్పించారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామ రాజు ధైర్యాన్ని..స్పూర్తిని కొనియాడారు. భీమవరంలో అల్లూరి 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న పీఎం మోదీ 30 అడుగులు అల్లూరి కాంస్య విగ్రహాన్ని వర్చ్యువల్ గా ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబసభ్యులైన అల్లూరు శ్రీరామ రాజును ప్రధాని మోదీ సత్కారించారు. ల్లూరి నడియాడిన ఈ వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాన్నారు. యావత్ భారతావనికి అల్లూరి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగపురుషుడు అల్లూరి అంటూ కీర్తించారు. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయిందని ప్రధాని గుర్తు చేసారు.

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని ప్రకటించారు. మొగల్లులోని ధ్యాన మందరి.. చింతపల్లి పోలీసు స్టేషన్ ను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అల్లూరి జయంతి రోజు మనందరం కలుసుకోవడం అదృష్టంగా అభివర్ణించారు. పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. యావత్ భారత్ తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నానని పేర్కొన్నారు. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. పింగళి వెంకయ్య..కన్నెగంటి హనుమంతు..ఉయ్యాలవాడ..పొట్టి శ్రీరాములు వంటి వారు దేశానికి చేసిన సేవలను ప్రధాని గుర్తు చేసారు. మనమంతా ఒకటేనన్న భావనతో ఉద్యమం జరిగిందన్నారు. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు నిలుస్తారంటూ ప్రధాని కీర్తించారు. దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం, ఒకే భావన భాగమైందని చెప్పారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను అల్లూరి ఒక్కతాటిపైకి తీసుకొచ్చారన్నారు.

అల్లూరి శౌర్యమే మనకు స్పూర్తిగా
మన్యం వీరుడిగా ముందుకొచ్చి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారంటూ నివాళి అర్పించారు. ఆనాడు ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఎందరో యువకులు పోరాడారంటూ కీర్తించారు. ప్రధానిదేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని పిలుపునిచ్చారు. లంబసింగిలో అల్లూరి సీతారామ రాజు మెమోరియల్.. బలి దానాలను ప్రతిబింబించే విధంగా మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ధింసా జన్మదినం సైతం ఘనంగా నిర్వహించామని గుర్తు చేసారు. ప్రధానిదేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల కల సాకారం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. గడిచిన 8 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. వకులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటున్నామని చెప్పిన ప్రధాని..మహనీయుల కల సాకారానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

భారత్ ను ఎవరూ అడ్డుకోలేరంటూ
అటవీ సంపదకు సంబంధించి 90 ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించామని వివరించారు. మన్యం ప్రాంతంలో ఉన్న యువకులకు కొత్త స్కిల్స్ ను అందించాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసామన్నారు. ఏపీలో విశాఖలో ట్రైబల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు గురించి ప్రధాని చెప్పుకొచ్చారు. వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మన్యం జిల్లాల్లో 750 ఏకలవ్య పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. దమ్ము ఉంటే నన్ను ఆపుకోండి..అంటూ బ్రిటీష్ వారితో అల్లూరి ధైర్యంగా సవాల్ చేసారని గుర్తు చేసారు. ఈ రోజు మనమంతా 133 కోట్ల భారతీయులు కలసి కట్టుగా ముందుగా ఇదే స్పూర్తితో సవాళ్లు ఎదుర్కోవాలని సూచించారు. దమ్ముంటే భారత్ ను ముందుకు వెళ్లకుండా ఆపు అనే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన దేశాన్ని ఎవరీ నిలువరించ లేరని స్పష్టం చేసారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్లను మరువం.. వారిని గుర్తించి..వారి స్పూర్తితో పని చేస్తామంటూ ప్రధాని వెల్లడించారు.
-
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా












Click it and Unblock the Notifications