• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

WTC Final Day 1 Session 1: టెస్ట్ మ్యాచ్ తొలి సెషన్ రద్దు...హెలికాప్టర్ రెడీ..

|

లండన్: ఊహించినట్టే- ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC final) మ్యాచ్‌కు వరుణ దేవుడు అడ్డుపడ్డాడు. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లడం కాదు.. ఏకంగా భారీ వర్షాన్ని గుమ్మరించేశాడు. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఈ మ్యాచ్ తొలి రోజు..తొలి సెషన్ అధికారికంగా రద్దయింది. ఇక రెండో సెషన్ కోసం ఎదురు చూస్తోన్నాయి రెండు జట్ల మేనేజ్‌మెంట్లు. ఒక్క బంతి కూడా పడకుండానే తొలి సెషన్ పూర్తిగా రద్దయింది. రెండో సెషన్‌పైన కూడా ఎలాంటి ఆశలు లేవు.

40 లక్షలమందిని మింగేసిన కరోనా: వైరస్ మరణాల్లో టాప్-5 కంట్రీస్ ఇవే40 లక్షలమందిని మింగేసిన కరోనా: వైరస్ మరణాల్లో టాప్-5 కంట్రీస్ ఇవే

 కీలకంగా మారిన సెకెండ్ సెషన్..

కీలకంగా మారిన సెకెండ్ సెషన్..

సెకెండ్ సెషన్ కూడా రద్దయితే..తొలి రోజు ఆటను అంపైర్లు వాష్ అవుట్ అయినట్టు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రెండో సెషన్ ఆట ప్రస్తుతం కీలకంగా మారినట్టయింది. వాస్తవానికి- భారత కాలమానం ప్రకారం.. ఈ మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేయాల్సి ఉంది. ఆ గడువుకు రెండు గంటల ముందు కూడా సౌథాంప్టన్‌లో వర్షం పడుతూనే ఉంది. మధ్యలో కాస్త విరామం ఇచ్చినప్పటికీ.. అది పూర్తిస్థాయిలో కొనసాగలేదు. ఆకాశం ఇంకా మేఘావృతమై కనిపించింది. వర్షం పడకపోయినప్పటికీ.. వెలుతురు లేమి మ్యాచ్‌ ఆరంభానికి అడ్డు పడదనడానికి గ్యారంటీ లేకుండా పోయింది.

ఉదయం కాస్త తెరపినిచ్చినా..

ఉదయం కాస్త తెరపినిచ్చినా..

ఈ పరిస్థితుల మధ్య తొలిరోజు ఆట దాదాపుగా వర్షార్పణమైనట్టే. ఈ ఉదయం కాస్త తెరపినిచ్చినప్పటికీ.. అది కాస్సేపే. కొంత సమయం తరువాత మళ్లీ భారీ వర్షం అందుకుంది. దీనితో తొలిరోజు తొలి సెషన్‌ను రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. టాస్ మాట అటుంచింతే- కనీసం గ్రౌండ్‌లో కూడా అడుగు పెట్టే పరిస్థితులు అక్కడ లేవు. అంపైర్లు, రెండు జట్ల క్రికెటర్లు, గ్రౌండ్ స్టాఫ్.. అంతా పెవిలియన్లకే పరిమితమయ్యారు. ఆకాశం వైపు నిరుత్సాహంగా చూస్తూ కనిపించారు.

రోజంతా వర్షమే..

రోజంతా వర్షమే..

బ్రిటన్ వాతావరణ శాఖ అధికారుల అంచనాల ప్రకారం.. ఆ దేశ కాలమానం ప్రకారం.. ఉదయం 10 గంటలకు వర్షం పడటానికి 80 శాతం మేర అవకాశం ఉంది. అదే 12 గంటలకు అది మరింత పెరిగింది. 90 శాతానికి చేరింది. ఇక సెకెండ్ సెషన్ సమయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నా మ్యాచ్ ప్రారంభం కాలేదు. మధ్యాహ్నం 2 గంటలకు వర్షం పడటానికి 90 శాతం మేర అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్ మెట్రొలాజికల్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది. సాయంత్రం 5 గంటలకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రిడిక్ట్ చేసింది. 5 గంటల సమయంలో వర్షం పడటానికి 80 శాతం మేర అవకాశాలు ఉన్నట్లు అంచనా వేసినట్లు తెలిపింది.

 రెండో రోజు తెరపి

రెండో రోజు తెరపి

రెండో రోజు కాస్త తెరపినచ్చే అవకాశాలు ఉన్నట్లు రెండు జట్ల క్రికెట్ మేనేజ్‌మెంట్స్ అంచనా వేశాయి. రెండో రోజు అంటే శనివారం 98 ఓవర్ల పాటు మ్యాచ్ కొనసాగొచ్చని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చెబుతోంది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నప్పటికీ.. రెండో రోజు వర్షం ఆగిపోతే- గ్రౌండ్‌లోని చిత్తడిని ఆరబెట్టడానికి హెలికాప్టర్‌ను వినియోగించే అవకాశాలు లేకపోలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించినా మ్యాచ్‌ను ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మూడో రోజు 50 నుంచి 70, నాలుగో రోజు 30 నుంచి 50 ఓవర్లు పడేలా వాతావరణం అనుకూలిస్తుందని పేర్కొంది.

English summary
WTC final between IND vs NZ Day 1 and session 1 Complete Wash out due to heavy rains in Southampton.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X