ఆటా డెట్రాయిట్ నిధుల సేకరణ
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) డెట్రాయిట్ చాప్టర్ నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతమైంది. ఈ నెల 19వ తేదీన చేపట్టిన ఈ కార్యక్రమంలో లక్ష డాలర్ల నిధులు సమకూరాయి. పదవ ఆటా సదస్సు కోసం ఈ కార్యక్రమం జరిగింది. ఆటా సదస్టు జులై 3 నుంచి 5వ తేదీ వరకు న్యూజెర్సీలో జరుగుతుంది. ఈ కార్యక్రమం మధుమితస సానం, అంచిత సానం గణపతి స్తోత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత అల్కానంద జూపూడి, రమణమూర్తి గోకుల సినిమా పాటల ఆలాపన జరిగింది. ధన్య శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమానికి 250 మంది అతిథులు హాజరయ్యారు. ఆటా డెట్రాయిట్ ప్రాంతీయ సమన్వయకర్త రాంరెడ్డి, సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఇది జరిగింది. కొత్తగా ఇరవై మంది ఆటాలో చేరడానికి ముందుకు వచ్చారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జితేందర్ రెడ్డి, జాతీయ సమన్వయకర్త డాక్టర్ విజయపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజు చింతల ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కృష్ణప్రసాద్ కాట్రగడ్డ, డాక్టర్ నర్సింహారెడ్డి గొట్టం, రామచంద్ర గొంగటి,డాక్టర్ పద్మా పటేల్, డాక్టర్ శ్రీనివాస్ కొడాలి, వాణి ఉప్పలపాటి, రావు నెరుసు, సాగర్ మారంరెడ్డి నిధుల సేకరణ కార్యక్రమానికి సహకరించారు. డాక్టర్ హరనాథ్ పొలిచెర్ల ఫోన్ చేసి కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రీతి చల్లా, ఉదయ్ చాపలమడుగు కూడా నిధుల సేకరణను సమన్వయం చేశారు. కార్యక్రమాన్ని సునీల్ మర్రి, లక్ష్మారెడ్డి తూముకుంట్ల, మురళి బొమ్మనవేణి, ప్రీతి చల్లా, ప్రవీణ్ రెడ్డి, అశోక్ పెరుమాండ్ల, అశ్విన్ కంచర్ల, సురేష్ గూగిళ్ల నిర్వహించారు.












Click it and Unblock the Notifications