పోలేపల్లి సెజ్ బాధితులతో ఎన్నారైలు

Nri
విజయ్ చవ్వా, రేణుకా వెలిదండల నాయకత్వంలో పాలమూరు ఎన్నారైల బృందం మహబూబ్ నగర్ జిల్లా పోలెపల్లి సెజ్ బాధితులను కలుసుకున్నారు. బాధితుల గోడును విన్నారు. పాలమూరు ఎన్నారైలతో పాటు సెజ్ ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్లు సుజాత సూరెపల్లి, మధు కాగుల ఉన్నారు. తమ పోరుకు అండగా నిలిచినందుకు సెజ్ బాధితులు ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు. తమకు జీనాధారమైన భూములను ప్రభుత్వం తీసుకోవడం వల్ల తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను బాధిత రైతులు ఎన్నారైలు వివరించారు. తమకు సెజ్ లోని యూనిట్లు ఉద్యోగం ఇవ్వడానికి కూడా నిరాకరిస్తుండడంతో పొట్ట పోసుకోవడం కూడా కష్టంగా ఉందని వారు వివరించారు.

తాము సెజ్ లకు వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం తన మిత్రులు, బంధువుల కోసం రైతుల జీవితాలతో ఆడుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని విజయ చవ్వా మీడియా ప్రతినిధులతో అన్నారు. సెజ్ ల విషయంలో ప్రభుత్వ పెద్దలు తమ బంధువులు, మిత్రులకు లాభం చేకూర్చడానికి ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్షాలు తమ బలాన్ని పెంచుకోవడానికి వాడుకుంటూ తర్వాత బాధితులను వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు. సెజ్ బాధితులను పట్టించుకోకపోతే సామాజిక అశాంతి చెలరేగుతుందని ఆయన అన్నారు.

రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని, ఈ వాస్తవాన్ని విస్మరిస్తే ఇటువంటి సమస్యలు తలెత్తుతాయని ఆయన అన్నారు. పోలేపల్లి సెజ్ బాధితులు కొంత మంది బిక్షగాళ్లుగా కూడా మారారని, వారి ముందు నుంచే సెజ్ యూనిట్ల యజమానులు బడాకార్లలో సాగిపోతున్నారని ఆయన అన్నారు. పోలేపల్లి సెజ్ బాధితులు జాతీయ మానవ హక్కుల కమీషన్ కు వెళ్లాలని, అందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తాము అందిస్తామని ఆయన చెప్పారు.

ప్రభుత్వం చైనాలోని షాంఘై జిల్లాలోని సెజ్ ను ఆదర్శంగా తీసుకోవాలని, ఆర్థిక ప్రగతిలో ప్రజలు భాగస్వాములుగా ఉన్నారని, మన దేశంలో సెజ్ లు ప్రభుత్వంలోని పెద్దల కోసమే ఏర్పడుతున్నాయని పాలమూర్ ఎన్నారైలు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+