ఇండియానా పోలిస్: సెయింట్‌లూయిస్ హిందూ దేవాలయంలో శనివారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, మహాకుంబాభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. 1990లో గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. దీపావళి వేడుకలను ఆలయ ఛైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి, డాక్టర్ జి.వి.నాయుడు తదితరులు పర్యవేక్షించారు.