అమెరికాలో వెల్లివిరిసిన తెలుగు భాషాభిమానం

"మా తెలుగు తల్లికి మల్లెపూదండ" ప్రార్ధనాగీతం అనంతరం జ్యోతి ప్రజ్వలనతో తెలుగు సాహాత్యవేదిక అధిపతి డాక్టర్. నరసింహారెడ్డి ఊరిమిండి అధ్యక్షతన తృతీయవార్షికోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ సంబరాలలో సాహిత్యవేదిక కార్యవర్గ సభ్యులు శ్రీ అనంత్ మల్లవరపు, డాక్టర్. రమణ జవ్వాడి, శ్రీ విజయ చంద్రహాస్ మద్దుకూరి, శ్రీ సురేష్‌కాజ మరియు శ్రీ రావుకల్వల చురుకుగా పాల్గొన్నారు.
టాంటెక్స్ అధ్యక్షుడు శ్రీ చంద్ర కన్నెగంటి తమ సందేశంలో ప్రవాసాంద్రులు తమ జీవితాలను సంగీతమో, సాహిత్యమో లేక నృత్యం వంటి కళలతో సుసంపన్నం చేసుకోవాలని అన్నారు. డాక్టర్. ఊరమిండి తెలుగు భాషాభివృద్ధి ప్రాముఖ్యత వివరించారు.
"తెలుగు సాహిత్యం: తీరుతెన్నులు" అనే అంశంపై శ్రీమతి అత్తలూరి విజలక్ష్మి, "కధ - సంఘర్షణ స్వరూపాలు" అనే అంశంపై రసవత్కవి శ్రీ కన్నెగంటి ప్రసంసించారు. తెలుగు సాహిత్య వేదిక దాతలు, ముఖ్య అధితులు సమక్షంలో తెలుగు గంధ్రాలయ సంకేత చిహ్నం ఆవిష్కరణతో ఉదయం కార్యక్రమాలకు తెరపడింది.
త్రిభాషా సహస్రావధాని శ్రీ. వద్దిపర్తి పద్మాకర్ నిర్వహించిన అష్టావధానాన్ని సభికులు అత్యంత ఆసక్తితో తిలకించారు. "పత్రికా భాష ఆవిర్భావం" అనే అంశంపై డాక్టర్. నరిసెట్టి ఇన్నయ్య మరియు "21వ శతాబ్ధంలో తెలుగు మనుగడ" అనే అంశంపై శ్రీ సురేష్ కొలిచాల అనేక ఉదాహరణలతో ప్రసంగించారు. "ప్రజాకళ" పత్రిక బృందం సమర్పించిన శ్రీశ్రీ "మరో ప్రపంచం" లఘునాటిక నేటి సామాజిక సమస్యలకీ పాతబడని సరికొత్త సరికొత్త అభ్యుదయ సందేశాలను అందజేసింది.
టాంటెక్స్ సాంస్కతిక కార్యదర్శి డాక్టర్. సుబ్బారావు పొన్నూరు సమర్పించిన సాయంకాల కార్యక్రమాలు శాస్త్రీయ నృత్యంతో ప్రారంభమై ప్రేక్షకులకు పున స్వాగతం పలికాయి. సుప్రసిద్ద వేణుగాన విద్వాంసులు ప్రొఫెసర్. ప్రపంచం సీతారం సమర్పించిన వేణుగాన సంగీతం సభికులను అలరింపజేసింది. డాక్టర్ రాళ్ళబండి కవితాప్రసాద్ రచించిన "ఆముక్తమాల్యద" నృత్యరూపకం ప్రముఖ కూచిపూడి నృత్యదర్శకులు, "నంది" పురస్కారగ్రహీత శ్రీ.కెవి సత్యనారాయణ దర్శకత్వంలో ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications