అమెరికాలో ఆముక్తమాల్యద

మాసానికో మహనీయుడు శీర్షిక కింద ఇస్మాయిల్ సాహితీ జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను సురేష్ కాజ వివరించారు. ముఖ్య అతిథి భైరవభట్ల కామేశ్వర రావును విజయ చంద్రహాస్ మద్దుకూరి పరిచయం చేశారు. ఆముక్తమాల్యద వైశిష్ట్యంపై భైరవభట్ల ప్రసంగించారు. ఆముక్త మాల్యద కావ్యం నుంచి కొన్ని ముఖ్యమైన పద్యాలను పఠించి అద్భుతమైన రాయలవారి వర్ణను గుర్తు చేశారు. టాంటెక్స్ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి దుశ్శాలువతో భైరవభట్లను సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు సురేష్ కాజ, అనంత్ మల్లవరపు, డాక్టర్ రమణ జువ్వాడి, ఊరిమిండి ముఖ్య అతిథిని జ్ఞాపికతో సన్మానించారు. భారతదేశంలో ఎలక్ట్రానిక్ సమ్మతి యంత్రాల పరిమితి, లోపాలను పాలకుల దృష్టికి తెచ్చి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణం కట్టుకున్న హరి కె. ప్రసాద్ ను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సన్మానించింది. ఆవుల మంజులత ప్రసాద్ ను సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షుడు చంద్ర కన్నెగంటి, పాలక మండలి సభ్యుడు రాం యలమంచిలి, కార్యదర్సి సురేష్ మండువ హరి కె. ప్రసాద్ ను సత్కరించారు.












Click it and Unblock the Notifications