తెలంగాణ సాధన కోసం

Gajula Buchanna
నిరుడు డిసెంబర్ 9వ తేదీ రాత్రి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనతో తెలంగాణా రాష్ట్ర కల సాఫల్యం దగ్గరయింది. తెలుగు ప్రజల్లో తెలంగాణా రాష్ట్ర అవర్భావం జరిగింది. ఇక జరగాల్సిందల్లా పాలనాపరమైన విభజన మాత్రమే. మనం భౌగోళికంగా విడిపోయి, కలిసి ఉందామని సీమాంధ్ర ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే, తెలంగాణా రాష్ట్ర అవతరణన జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనం ఇప్ప్దటి నుంచే జాగ్రత్త పడడం ఉత్తమం. గత సంవత్సరం మనం ఎలాగైతే ఉద్యమం చేశామో అలా చేయడానికి సిద్ధం కావాలి. అలాగే ముందుగా మన నాయకులను ఉద్యమంలో ముందుంచాలి. అవసరమైతే వారికి కూడా సహాయ నిరాకరణ కూడా చేసి వారిఫై ఒత్తడి తెచ్చి ముందు ఉంచాలి.

ప్రత్యేకంగా విద్యార్ధి మిత్రులను కోరేదేంటంటే, మీరు ఆవేశాలకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దు, గాంధీ చూపిన బాటలో శాంతియుతంగా ఉద్యమం చేయాలి. తెలంగాణా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు విన్నవించేదేమంటే, మనం ఆవేశాలకు లోనుకాకుండా, మన పనులు మనం చేసుకుంటూనే ఉద్యమంలో శాంతియుతంగా పాల్గొనాలి. మన సీమాంధ్ర నాయకులను చూసి మనం నేర్చుకోవలిసింది ఎంతైనా ఉంది. వాళ్ళలో కొంత మంది నాయకులు మన తెలంగాణా రాకుండా ఒక సంవత్సరం అయితే ఆపగలిగారు. మరి మన తెలంగాణా నాయకులు అంతా కలిసి ఇప్పుడు తెలంగాణా తీసుకురావాలి. దీనికోసమని పార్టీలకు అతీతంగా అందరు కలిసి పని చేయవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా పాలక పార్టీ నాయకులఫై ఎక్కువ బాద్యత ఉంది.

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి - సీమాంధ్ర వాళ్ళు రాజీనామా చేసినప్పుడు ఎవరికో పేరు వస్తుందని లేదా ఏ పార్టీ వాళ్ళు మొదలు పెట్టారనే విషయాన్ని చూడకుండా అందరూ కలసి కట్టుగా రాజీనామాలు ఇచ్చారు. మరి మన వరకు వచ్చే వరకు ఎందుకు ఈ కుంటి సాకులు. మనకు సహనం ఎక్కువ కాబట్టి ఇన్నిరోజులు శ్రీకృష్ణ కమిటీని నమ్ముకొని ఉన్నాం, ఇంతలోపే జరగాల్సిన నష్టం జరిగింది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గుడ్డిగా నమ్మకుండా, మన జాగ్రత్తలో మనం ఉండటం శ్రేయస్కరం.
-గాజుల బుచ్చన్న, కాలిఫోర్నియా నుంచి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+