మలేషియాలో హిందూ పూజారుల శిక్షణ కేంద్రం

ఔత్సాహిక యువకులకు దేవాలయ అర్చకులుగా శిక్షణ ఇచ్చే కేంద్రం సోమవారం ప్రారంభమయింది. ఇక్కడి ఇపో పట్టణంలోని జెలపంగ్ తాంబాహన్‌లో అట్టహసంగా ప్రారంభమైన హిందూ పూజారుల అకాడెమీ మలేషియా వ్యాప్తంగా ఉన్న 3000 దేవాలయాలకు అర్హులైన పూజారులను సమకూర్చగలదని ఈ సంస్థ నిర్వాహకులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
ఈ అకాడెమీ రాకతో దేవాలయాల అర్చకుల కోసం భారత్‌పై ఆధారపడే అవసరం ఇకముందు ఉండదని ఇక్కడి భారత సంతతికి చెందిన నేత, మానవ వనరులశాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. హిందూ పండుగలు, పుణ్యకార్యాలు చేయడానికి అర్హులైన పూజారులను ఇది అందించగలదని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఇది ప్రారంభమవుతుందని, దీనికి అవసరమైన ప్రభుత్వ సహకారమందిస్తానని హామీనిచ్చారు.
హిందూ పూజారుల అకాడెమీని మలేషియన్ అర్చక సంఘం నిర్వహిస్తోంది. భారత్‌లోని ప్రముఖ అర్చక సంఘాలను సంప్రదించి ఐదు సంవత్సరాల ఈ కోర్సును రూపొందించారు.












Click it and Unblock the Notifications