యుఎఈలో భారతీయులకు అందని న్యాయ సాయం

NRI
చండీగఢ్‌: యూఏఈలో మరణశిక్ష పడిన భారతీయులకు సరైన న్యాయసహాయం అందడం లేదని, వారిని చిత్రహింసకు గురి చేస్తున్నారని పంజాబ్‌కు చెందిన సేవా కార్యకర్త, న్యాయవాది నవకిరణ్‌ సింగ్‌ ఆరోపించారు. ఇటీవల షార్జాలో పర్యటించి వచ్చిన ఆయన ఇక్కడ విలే కరులతో మాట్లాడారు. చార్జిషీటు ప్రతిని ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారని ఆయన చెప్పారు. బాధితులకు అర్థంకాని అరబిక్‌ భాషలో విచారణ నిర్వహిస్తున్నారన్నారు. అరబిక్‌లో ఉన్న పత్రాలపై వారిచేత సంతకాలు పెట్టించుకున్నారని ఆయన తెలిపారు. గత తొమ్మిది రోజులుగా పోలీసులు తమకు చిత్రహింసలు పెడుతున్నారని బాధితులు తనతో చెప్పారని నవకిరణ్‌ సింగ్‌ తెలిపారు.

మరో న్యాయవాది గగన్‌ అగర్వాల్ ‌తో కలిసి ఈ నెల 13, 14 తేదీల్లో షార్జాలో పర్యటించిన ఆయన మరణశిక్ష పడ్డ భారతీయులను కలిశారు. రెండు గంటలపాటు వారితో మాట్లాడారు. భారత కాన్సులేట్‌ జోక్యం చేసుకుని శిక్ష పడిన 17 మంది భారతీయులకు సరైన న్యాయ సహాయం అందేలా చూడాలని నవకిరణ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. పాకిస్థాన్‌ పౌరున్ని హత్య చేయడంతో పాటు మరో ముగ్గురిని గాయపరిచారన్న నేరంపై షార్జా కోర్టు వీరికి మరణశిక్ష విధించింది. శిక్ష పడ్డ వారిలో 16 మంది పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన వారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+