జగన్ అరెస్టుకు ఎన్నారైల డిమాండ్

తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న అమరవీరుల కుటుంబ సభ్యులు తమకు కొండా సురేఖ ఇవ్వజూపిన 25 వేల రూపాయలేసి సాయాన్ని తిరస్కరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. జగన్ ఇచ్చేది మొత్తం 30 లక్షల రూపాయలైతే ఓదార్పు యాత్రకు కల్పించే భద్రతకు కోట్లాది రూపాయలు ఖర్చవుతోందని వారన్నారు. ఓదార్పు యాత్ర పేరు మీద జగన్ తెలంగాణ ప్రజలు తీయడానికి ఒడిగట్టారని వారు ఆరోపించారు. జగన్ ను ప్రభుత్వం రైలు ఎక్కినివ్వకుండా ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. జగన్ వరంగల్ యాత్రకు అనుమతి కూడా తీసుకోలేదని, తెలంగాణ సంఘాలకు మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారని వారు విమర్శించారు. జగన్ చట్టానికి అతీతుడిగా కనిపిస్తున్నారని వారు వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications