వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో జెపికి తెలంగాణ వేడి

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
హైదరాబాద్: అమెరికాలో కూడా లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణకు తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత తప్పలేదు. భారత నిర్మాణానికి విరాళాల సేకరణకు జెపి ఇటీవల అమెరికా వెళ్లారు. జెపికి తమ నిరసనన తెలియజేయడానికి ఈ నెల 23వ తేదీన సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో తెలంగాణ ఎన్నారైలు పెద్ద గుమికూడారు. సన్నివాలే హిందూ ఆలయంలో జెపి తన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థీకృత వివక్ష లేదని జెపి చేసిన ప్రకటనకు సాన్ ఫ్రాన్సిస్కోలోని తెలంగాణవాదులు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. శాతాలతో గణాంకాలను మార్చి తిమ్మిని బమ్మిని చేయవద్దని తెలంగాణ ఎన్నారైలు జెపికి సూచించారు.

వాషింగ్టన్ లో జెపి చేసిన ఆ ప్రకటనపై సాన్ ఫ్రాన్సిస్కోలో ప్లకార్డులతో, కరపత్రాలతో తెలంగాణ ఎన్నారైలు నిరసన తెలిపారు. ధన, అధికార, కుల రాజకీయాల ప్రభావంలో పడకుండా తెలంగాణపై నిజాయితీగా ముందుకు రావాలని వారు ఆయనను డిమాండ్ చేశారు. జయప్రకాష్ నారాయణ కొన్ని విలువలకు కట్టుబడి ఉంటారనే అభిప్రాయం బలంగా ఉందని, అయితే రాజకీయ ఆకాంక్షల కోసం వాటిని ఆయన తాట్టు పెట్టే పరిస్థితి ఉందని తెలంగాణ ఎన్నారైలు విమర్శించారు. ఆయన ముందు తెలంగాణ పట్ల జరుగుతున్న వివక్షను ఆయన ముందుంచారు. వాటికి సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

తమకు సమాధానం ఇవ్వలేక జయప్రకాష్ నారాయణ వెనక ద్వారం గుండా వేదిక మీదికి చేరుకున్నారని తెలంగాణ ఎన్నారైలు చెప్పారు. ఇతర రాజకీయ పార్టీల నాయకుల మాదిరిగానే తెలంగాణ విషయంలో జెపి వ్యవహరించారని వారు విమర్శించారు. ఒక ప్రాంతం మనోభావాలను కించపరచవద్దని వారు జెపికి సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X