శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషిక్తుడై 500 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని అమెరికాలోని న్యూ జెర్సీలో ఇటీవల ఆముక్తమాల్యద కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శించారు.అందరినీ ఆకట్టుకున్న ఈ ప్రదర్శనను సుప్రసిద్ధ కూచిపూడి కళాకారుడు కెవి సత్యనారాయణ రూపొందించారు. స్థానిక కళాకారిణి శ్రీమతి ఇందిరా శ్రీరామ్ దీక్షిత్ తో పాటు స్థానిక కూచిపూడి నృత్య పాఠశాలకు చెందిన 30 మంది కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలనాటి కథానాయిక అంజలీదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ జ్ఞాపికలను అందజేసి ఆశీర్వదించారు.