జెపి ఆఫీసులపై దాడికి ఎన్నారైలు ఫైర్

నేరాలకు సంబంధం లేని కార్యకలాపాలను క్షమించాలని జెపి స్వయంగా చెప్పారని, అది సరిపోదని అన్ని గ్రూపులు భావిస్తున్నాయని, చట్ట పరిధిలో వారికి ఏదైనా అడగడానికి హక్కు ఉంటుందని తెలిపింది. చట్టాన్ని అతిక్రమిస్తూ క్షమించాలని కోరడం వైరుధ్యంతో కూడిందని వ్యాఖ్యానించింది. జయప్రకాష్ నారాయణ ప్రకటనను తాము పూర్తిగా బలపరుస్తున్నట్లు తెలిపింది. ప్రజలను బెదిరిస్తూ ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం సహించరానిదని వ్యాఖ్యానించింది. రాజకీయాలు మతం, కులం, ప్రాంతం ఆధారంగా నడవకూడదని తమ భావన అని తెలిపింది. కొంత మంది బంధుప్రీతి, వారసత్వం, రాజ్యాంగ వ్యతిరేక పద్ధతులూ శక్తి ద్వారా రాజకీయాలు నడవకూడదని తమ అభిప్రాయమని చెప్పింది.












Click it and Unblock the Notifications