అమెరికాలో బాబా ఆలయ శంకుస్ధాపన

మూడు రోజుల పాటు సాయినామ జపం, పారాయణం నిరంతరాయంగా కొనసాగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డెల్వేర్ దేశ కమిషనర్ టామీ థామ్సన్ హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తానని పేర్కొన్నారు. సాయిబాబాను ప్రతిష్ఠించే ప్రదేశంలో విశేష పూజలు జరిపారు. చిన్మయ మిషన్ శ్రీ బ్రహ్మచారి ప్రభోద్ చైతన్య సందర్శించి ఆలయాల ప్రాముఖ్యతను వివరించారు. 7.73 ఎకారాల్లో నిర్మితమవుతున్న సాయిబాబా ఆలయం ఉత్తర అమెరికాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడిస్తుందని రమేష్ అడబాల చెప్పారు. సాయిబాబా టెంపుల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ సత్య యర్రంశెట్టి, అధ్యక్షుడు తేజోమూర్తి, బ్రహ్మానందం శ్రీనివాస్,రామచంద్ర. ఆర్, ధర్మకర్తల మండలి సభ్యులు కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.












Click it and Unblock the Notifications