వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేటర్ బోస్టన్ లో గ్రేటెస్ట్ ఉగాది వేడుకలు

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
ఇండియానాపోలిస్‌: ఆలస్యంగా జరిగినా అక్కడ ఉగాది వేడుకలు అద్భుతంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ బోస్టన్‌(టిఎజిబి) ఆధ్వర్యంలో ఆదివారం నాడు క్యాంటన్‌ నగరంలోని క్యాంటన్‌ హైస్కూల్‌లో ఉగాది వేడుకలను కన్నులపండుగగా నిర్వహించారు. సుమారు 1500 మంది హాజరయిన ఈ వేడుకల్లో సంఘ నూతన కార్యవర్గ కమిటీ, ట్రస్టీ బోర్డు సభ్యులను ప్రకటించారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ప్రకాష్‌ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కన్నెగంటి మూర్తి, కార్యదర్శిగా కందుకూరి కోటేశ్వరరావు, కోశాధికారిగా దోగిపర్తి శివ, సాంస్క్రతిక కార్యదర్శిగా పరకాల పద్మ, సహాయ కార్యదర్శిగా చాగంటి శ్రీనివాస్‌, సహాయ కోశాధికారిగా కొల్లిపర శ్రీనివాస్‌, ట్రస్టీ బోర్డు చైర్మెన్ ‌గా నన్నపనేని మోహన్‌, వైస్‌-చైర్మెన్‌గా గుండవరం పాపారావు, సభ్యులుగా దాసరి ఆమని, బొలినేని పూర్ణచంద్రరావు, పోలవరపు బాబురావు, కాకి శ్రీనివాస్‌, జయంతి సూర్యలు వ్యవహరిస్తారు. తాడి గాయత్రి, వంశీ కోడూరి స్వాగతోపన్యాసంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఏడు గంటల పాటు సాగిన సంబరాలకు అమరవాది కళ్యాణ్‌, చలుపాడి భావన వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. సుమారు 200 మంది చిన్నారులు, యువతీయువకులు తమ ప్రతిభాపాటవాలు, వేమన పద్యాలు, సంగీత, సాహిత్య, సాంస్క్రతిక, న్రత్య, గాన ప్రదర్శనలతో ప్రవాసాంధ్రులను ఆకట్టుకున్నారు. పీవీఆర్‌ నరసింహారావు సిద్ధాంతి పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. నూతన అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి ప్రవాసాంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది బోస్టన్‌ తెలుగు సంఘ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రముఖ తెలుగు సాహితీవేత్త, దర్శకుడు, గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు 'నవ్వులపువ్వులు', పార్ధసారధి, సౌజన్యల సంగీత ప్రదర్శన వేడుకల్లో ప్రధానాకర్షణగా నిలిచాయి. బోస్టన్‌ తెలుగు సంఘ కార్యవర్గ, ట్రస్టీ బోర్డు సభ్యులు కళాకారులు, అతిధులు, వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, జ్ఞాపికలను బహుకరించారు. 'జనగణమన...' గీతాలాపనతో కార్యక్రమాలను ముగించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X