కువైట్ లో తెలుగు మహిళ దారుణ హత్య

వీరు బద్వేలులోనే నివాసం ఉంటున్నారు. లక్ష్మీదేవి ఆరేళ్లుగా కువైట్‌లో ఉంటుంది. భర్త స్థానిక హోటల్‌లో మాస్టర్‌గా పని చేసేవాడు. భర్త తాగుబోతు కావడంతో సంపాదించినదంతా మద్యానికి ఖర్చు చేసేవాడు. దీంతో పిల్లలను పోషించుకునేందుకు లకీదేవి కువైట్ వెళ్లింది. ఏడాదిన్నర కిందట బద్వేలుకు వచ్చి వెళ్లింది.
ఏడు నెలల కిందట భర్త శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పట్లో బద్వేలుకు వచ్చిన లక్ష్మీదేవి రెండు నెలలు ఇక్కడే ఉండి ఐదు నెలల కిందట కువైట్ వెళ్లింది. ఆజాద్ వీసాపై అక్కడే పని చేసుకుంటూ ఉండేది. ఆదివారం కువైట్ లో గుర్తు తెలియని వ్యక్తులు లక్ష్మీదేవిని హత్య చేసి చెత్త తొట్టిలో పడేసినట్లు అమె పెద్దమ్మ కుమారుడు రాముకు కువైట్ నుంచి సన్నిహితులు ఫోన్ ద్వారా తెలిపారు.
రాము ఈ విషయాన్ని లక్ష్మీదేవి తల్లి, సోదరికి తెలిపాడు. కువైట్ లో ఏమి జరిగిందో తెలియలేదని, ఆదివారం ఫోన్ ద్వారా కువైట్ లో లక్ష్మీదేవి హత్యకు గురైనట్లు తెలిసిందన్నారు. తమకు మగదిక్కు లేకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలియజేయలేదన్నారు. తమకు ఇంతకు మించి సమాచారం కువైట్ నుంచి రాలేదన్నారు.
హతురాలు లక్ష్మీదేవికి కుమారుడు సుబ్బరాయుడు (12), నాగలక్ష్మి(9) అనే కూతురు ఉన్నారు. కువైట్ నుంచి లక్ష్మీదేవి పంపించే డబ్బుతో వితంతువైన తల్లి, భర్త వదిలేసిన సోదరి లక్ష్మీదేవి పిల్లలను పోషించుకుంటున్నారు. ఇదిలా ఉండగా కువైట్ లో ఆమె స్నేహితుడి ద్వారా మోసానికి గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హత్యకు గురైనట్లు తెలుస్తోంది.