లండన్ అల్లర్లు: ఆంధ్ర విద్యార్థుల ఆందోళన

London Riots
లండన్ అల్లర్లు ఆంధ్ర విద్యార్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. చదువుకోవడానికి అక్కడికి వెళ్లిన విద్యార్థులు భయం భయంగా బతుకు వెళ్లదీస్తున్నారు. లండన్, బర్మింగ్‌హామ్ వంటి నగరాల్లో విచ్చలవిడిగా దాడులు, లూటీలు జరుగుతున్నాయి. క్యాపిక్యాట్ నేరాలు జరుగుతున్నాయి. విపరీతమైన నిరుద్యోగం వల్ల సామాజిక, ఆర్థిక అస్థిరత్వం పేరుకుపోయి బ్రిటన్‌లోని అశాంతి ఈ రూపం తీసుకుందని భావిస్తున్నారు. యుకెకు వలసవచ్చినవారిపై కూడా దాడులు జరుగుతున్నాయని అంటున్నారు.

మాతృభూమికి మైళ్ల కొద్ది దూరంలో ఉన్న ఆంధ్ర విద్యార్థులు ఆత్మరక్షణ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆహారం, ఇతన నిత్యావసర సరుకులను భద్రపరుచుకోవడంతో పాటు భద్రత కోసం అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. బయటకు పోవడానికి కూడా భయపడుతున్నారు. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే గ్రూపుగా వెళ్తున్నారు.

కొంత ఊరట కలిగించే విషయం ఏమిటంటే - చాలా మంది విద్యార్థులు బ్రేక్ కోసం స్వదేశానికి వచ్చారు. వేసవి కాలంలో హాస్టళ్లు మూసేయడంతో చాలా మంది వచ్చేశారు. కొంత మంది మాత్రం అద్దె గదుల్లో ఉంటున్నారు. అనూహ్యంగా అరగంటలోపే అల్లర్లు ఎగిసిపడడంతో ఏమీ చేయలేని స్థితిలో పడ్డారు. లివర్‌పూల్‌లో కూడా అల్లర్లు చెలరేగుతున్నాయి. కోవెంట్రీ ఏ క్షణమైనా బద్దలు కావచ్చునని అంటున్నారు. కోవెంట్రీలో కూడా ఒకటి రెండు దాడులు జరిగినట్లు చెబుతున్నారు. దీని గురించి మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు. అయితే, పెద్ద యెత్తున పోలీసు బలగాలను దించి విదేశీయులకు రక్షణ కల్పించే ఏర్పాట్లు జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+