ఆంధ్రప్రదేశ్‌లో ఆటా వేడుకలు, సేవా కార్యక్రమాలు

NRI
ఆంధ్రప్రదేశ్‌లో తలపెట్టిన వేడుకలకు, సేవా కార్యక్రమాలకు అమెరికా తెలుగు సంఘం (ఆటా) రూపకల్పన చేసింది. ఆటా బోర్డు సమావేశం సెప్టెంబర్ 17వ తేదీన వాషింగ్టన్ డిసిలో జరిగింది. ఈ సమావేశంలో ఆటా స్టాండింగ్ కమిటీ చైర్స్, ప్రాంతీయ సమన్వయకర్తలు, ప్రముఖులతో పాటు అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ జిన్నా, బోర్డు సభ్యులు, పెద్ద యెత్తున తెలుగు ప్రజలు పాల్గొన్నారు. అమెరికా మొత్తం నుంచి 250 మందికి పైగా ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.

అట్లాంటాలో తలపెట్టిన 2012 సంవత్సరం 12వ ఆటా సదస్సుపైనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే ఆటా వేడుకల గురించి, సేవాకార్యక్రమాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. గత ఏడాది కాలంగా చేసిన ఆటా కార్యక్రమాలపై రాజేందర్ జిన్నా వివరించారు.12వ ఆటా సదస్టు కోసం రూపొందించిన కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. ఆటా వేడుకల గురించి, సేవా కార్యక్రమాల గురించి ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం వివరించారు. డిసెంబర్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్‌లోని కరీంనగర్, మైలవరం, హైదరాబాదుల్లో ఆటా వేడుకలను నిర్వహించనున్నట్లు కరుణాకర్ చెప్పారు.

కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డి (కన్వీనర్), డాక్టర్ జగన్మోహన్ రావు (సమన్వయకర్త)లు కాన్ఫరెన్స్ కమిటీకి చెందిన 50 మంది అట్లాంటా నుంచి వాషింగ్టన్ డిసికి వచ్చి సమావేశంలో పాల్గొన్నారు. అట్లాంటా సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్ల పట్ల బోర్డు సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ట్రస్టీ స్థానంలో కన్సాస్ సిటీకి చెందిన డాక్టర్ రవి కల్లూరును ఆటా బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. సమావేశానికి ఏర్పాట్లు చేసిన వాషింగ్టన్ డిసి జట్టు రాంమోహన్ కొండా (కార్యదర్శి), భువనేష్ బూజల (ట్రస్టీ), రాజష్ మాదిరెడ్డి (ట్రస్టీ), ప్రాంతీయ సమన్వయకర్త మనోహర్ ఈనుగు, సౌమ్య కొండపల్లి, బాబు గుమ్మడి, జయేందర్‌లకు బోర్డు కృతజ్ఞతలు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+