అట్లాంటాలో ఆటా సమావేశం

ఆటా కోశాధికారి సత్యనారాయణ కండిమల్ల తన నివేదికను సమర్పించారు. డిసెంబర్‌లో భారతదేశంలో ఆటా వేడుకలను నిర్వహించాలనే ప్రతిపాదనను తమ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ మాధవరం చెప్పారు. సభ్యత నమోదులో జరిగిన ప్రగతిని ఆటా కార్యాలయ సమన్వయకర్త నరేందర్ చెమర్ల వివరించారు. యువ నాయకత్వాన్ని ముందుకు తెచ్చే బాధ్యతను జిన్నా కరుణాకర్ రెడ్డి ఆసిరెడ్డికి అప్పగించారు. ఆయనను కన్వీనర్‌గా ప్రకటించారు. హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా గత అధ్యక్షుడు తామా వ్యవస్థాపక సభ్యుడు డాక్ట్ర జగన్మోహన్ రావును సమావేశం సదస్సు సమన్వయకర్తగా ఎన్నుకుంది. 12వ ఆటా సదస్సును విజయవంతం చేయాలని జిన్నా కోరారు. డాక్టర్ సంధ్య గవ్వా, శ్రీనివాస్ పిన్నపురెడ్డి, రాజేశ్వర్ టెక్మల్, పరమేశ్ భీమిరెడ్డి వంటి అనుభజ్ఞుల సహకారంతో సదస్సు విజయవంతమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications