బోస్టన్‌లో తెలంగాణ నైట్

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ప్రదర్శనలను పిల్లలు, పెద్దలు ఇచ్చారు. యువేన్, గాయత్రి, వంశీకృష్ణ, ప్రినిక, అనీషా, ఆషిఖ్ జానపద నృత్యాలు అందరినీ అలరించాయి. ఆలోక్ మాచెర్ల అసైదులా హారతి పాటకు నృత్యం చేశాడు. పవన్ కొండోజు, మధు పురుషోత్తం, వెంకట్ మాచెర్ల, అమర్ కమిల్ల, రమేష్ దదిగల నృత్యం కూడా విశేషంగా ఆకట్టుకుంది. జయ జయహే తెలంగాణ పాట నుంచి జై బోలో తెలంగాణ మీదుగా పొడుస్తున్న పొద్దు మీద పాటతో పూర్తయింది. తెలంగాణ ఉద్యమ గీతానికి యషిత, మేధ, రిషిక, రితిక, ప్రగతి, జాగృతి నృత్యం చేశారు.
తెనా బోస్టన్ చాప్టర్ తొలిసారి తెలంగాణ పత్రిక తంగేడును ప్రచురించింది. ఈ పత్రికను లక్ష్మా రెడ్డి ఆవిష్కరించారు. గత నవంబర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన డాక్టర్ ఒమర్ ఖలీదీకి సంతాపం ప్రకటించారు. తెనా చైర్మన్ రవి మేరెడ్డి తెలంగా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి సహకరిస్తున్నవారికి కృతజ్ఢతలు తెలిపారు. రవి మేరెడ్డి, పురుషోత్తం రాజు, వెంకట్ రెడ్డి ముద్దసాని, శ్రీనివాస్ మేనేని బహుమతులు ప్రదానం చేశారు.












Click it and Unblock the Notifications