ఎన్నారైల కొవ్వొత్తుల ప్రదర్శన

హౌస్టన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సంతకాల సేకరణలో భాగంగా దాదాపు ౩౦౦ మంది విద్యార్థులు లోక్‌పాల్ బిల్లును పటిష్టపరచడానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు .ఫిఫ్త్ పిల్లర్ తరఫున అమెరికాలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల లోని భారతీయ విద్యార్థుల మద్దతు ని కూడగడుతామని ఈ బిల్లు కార్యరూపం దాల్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బిల్లు గురించి ప్రవీణ్ పోతినేని మాట్లాడుతూ ఈ బిల్లుపై ప్రజలకు ఇంకా చాల అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు .త్వరలో ఫిఫ్త్పిల్లర్ ఆ పని చేపడుతుందని తద్వారా బిల్లుపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తే ప్రజలమద్దతు ఇంకా చాల పెరిగే అవకాశాలు ఉన్నాయి అని తెలిపారు.
యువత ఇంకా పెద్దసంఖ్యలో ఇందులో పాలు పంచుకుంటే తప్ప మనదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలపలేమన్నారు. ప్రపంచకప్‌లో మనదేశం నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది గానీ అవినీతిరహిత దేశాల్లో మనదేశం 87 వ స్థానం లో ఉందన్నారు. అందులో మనదేశం నెంబర్ వన్ స్థానం ఆక్రమించాలంటే యువత పెద్దసంఖ్యలో భాగ్యస్వామ్యులవ్వాలని సందీప్ దాడి తెలిపారు.