తెలంగాణ ఎన్నారైల చలో డిసి మార్చ్

ఈ సందర్భంగా అంతర్జాతీయ మీడియాను ఆహ్వానించి తెలంగాణపై వివరించాలని నిర్ణయించుకున్నట్లు టిఎన్నారై - జెఎసి తరఫున రవి మేరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో 600 మందికి పైగా ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో, లక్షలాది ఉద్యోగులు విధులకు గైర్హాజరవుతూ సమ్మెలో పాల్గొంటున్నారో వివరిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ వద్ద సాక్ష్యాలతో కూడిన వివరాలున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ ఎన్నారైల మద్దతు ఉంటుందని తెలంగాణ ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications