డల్లాస్‌లో తెలుగు సాహిత్య వెలుగులు

కాటూరి నారాయణని టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, రాజేష్ చిలుకూరి సంయుక్తంగా దుశ్శాలువతో, ఆధ్యక్షుడు ఎన్ ఎమ్ ఎస్ రెడ్డి, ఎమ్ వి ఎల్ ప్రసాద్ ఙ్ఞాపికతో సత్కరించారు. తరువాత అక్కినేని నాగేశ్వరరావు పుట్టిన రోజు సందర్భంగా డా. సి.ఆర్.రావు గారు ఆయన జీవిత విశేషాలను సభికులతో పంచుకున్నారు. తేనీటి విరామం తరువాత ప్రధాన వక్త డా. వడ్డేపల్లి కృష్ణగారిని డా. జువ్వాడి రమణ సభకు పరిచయం చేశారు. డా. వడ్డేపల్లి కృష్ణ ప్రారంభంలో గీతానికీ గేయానికీ మధ్య గల తేడాను వివరించి లలిత గీతాల పుట్టుక, లక్షణం, వికాసాల గురించి సభికులకు విశదీకరించారు. గురజాడ ముత్యాల సరాల నుండి ఆధునిక కవుల వరకు పరిశీలించి ఎవరి కవితలని లలిత గీతాలుగా నిర్వచించవచ్చో, ఎవరి కవిత్వం లలితగీతాలుఅనలేమో తెలియ జేశారు.
దేవులపల్లి కృష్ణ శాస్త్రి, బసవరాజు అప్పారావు లలిత గీతాలకి ఆద్యులని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. లలిత గీతాల తరువాత తను చేసిన ఛందో ప్రయోగం పాటవెలదిని వివరించి కొన్ని పాటవెలదులతో సభికులని అలరించారు. తరువాత టాం టెక్స్ సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా. ఊరిమిండి నరసింహా రెడ్డి, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ లు డా. వడ్డేపల్లి కృష్ణకి జ్ఞాపిక సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది.












Click it and Unblock the Notifications