బే ఏరియాలో తెలుగు మహిళా సంబరాలు

NRI
అమెరికాలోని బే ఏరియా మిల్పిటాస్‌లో ఈ నెల 1వ తేదీ ఆదివారం తెలుగు మహిళా సంబరాలు కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమ నిర్వాహకుడు శివ ఆర్. ఎర్రగుడి ఆ విషయం చెప్పారు. ఈ కార్యక్రమానికి డాక్టక్ హనిమి రెడ్డి, డాక్ట్ వింజమూరి అవసరాల, అనసూయా దేవి, విజయ్ చావ్, శ్రీమతి హనిమి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం విశిష్టమైందని హనిమి రెడ్డి అన్నారు. మహిళలకు ప్రధానమేందేమిటో ఆయన వివరించారు.

ఇంత విశిష్టమైన కార్యక్రమానికి తాను హాజరైనందుకు డాక్టర్ వింజమూరి అనసూయా దేవి ఆనందం వ్యక్తం చేశారు. మానవుల తరఫున ఈ కార్యక్రమాన్ని తాను మహిళలకు అంకితం చేస్తున్నట్లు శివ ఆర్ ఎర్రగుడి అన్నారు. తొలుత తెలుగు మహిళల కోసం ఫ్యాషన్ షో జరిగింది. ఇందులో 61 మంది పాల్గొన్నారు. ఆ తర్వాత తెలుగు సంప్రదాయ ఆటలు నడిచాయి. రాఫిల్‌లో ఐదు బంగారు నాణేలు ఇచ్చారు. ఫ్యాషన్, క్రీడలు, నృత్య విభాగాల విజేతలకు 26 ట్రోఫీలు ప్రదానం చేశారు.

శివ ఆర్ ఎర్రగుడి, విజయ్ బంకా, పద్మా విష్, గాయత్రి ఎ, స్నేహ వేదుల, వాణి వావిలాల, వసంత్, కల్యాణ్ గాదె, విద్య, శ్రీనివాస్ గొట్టపాటి, శ్రీవాణి ఎర్రగుడి, చేమా యెనుగు, మల్లిక్ పూవు, కపిల, సులోచన, సమత నిర్వాహక కమిటీలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+