మెజార్టీ భారత విద్యార్థులు బోగస్?

బ్రిటన్‌కు వస్తున్న బోగస్ విద్యార్థుల్లో మయన్మార్ మొదటి స్థానం అక్రమించగా, భారత్ రెండో స్థానంలో ఉందని ఆ అధ్యయనం వెల్లడించింది. భారత్‌తో సమాన స్థానాలు బంగ్లాదేశ్, నైజీరియాలు ఆక్రమించినట్లు తెలిపింది. కచ్చితంగా విద్యార్థులేనా కాదా అని తేల్చుకోవడానికి సంస్థ విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారిని ఇంటర్వ్యూ చేసింది. వారు నిజంగా విద్యార్థులేనా కాదా అనే అంశంపై, చదువు పూర్తయిన తర్వాత స్వదేశం తిరిగి వెళ్తారా, లేదా అనే అంశంపై అధ్యయనం సాగింది.
క్రెడిబిలిటీ ప్రాతిపదికగా 63 వేల మంది విద్యార్థుల వీసాలను తిరస్కరించవచ్చునని అభిప్రాయపవడింది. వీరిలో 61 శాతం మంది ప్రైవేట్ నిధులు సమకూరుస్తున్న కాలేజీలకు, 17 శాతం మంది ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న కాలేజీలకు, 14 శాతం మంది యూనివర్శిటీలకు దరఖాస్తు చేసుకున్నారు. హోం ఆఫీస్ ఈ ఏడాది పది వేల మంది విద్యార్థులను ఇంటర్వ్యూ చేయాలని తలపెట్టింది.
భారీగా దుర్వినియోగం జరుగుతోందని, బోగస్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తూ బ్రిటిష్ వారి ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని మైగ్రేషన్ వాచ్ చైర్మన్ ఆండ్ర్యూ గ్రీన్ అన్నారు. చదువులు పూర్తయిన తర్వాత స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి కూడా చాలా మంది ఇష్టపడడం లేదని అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియాల్లో మాదిరిగా బ్రిటన్‌లో ఎగ్జిట్ తనిఖీలు లేవని, ఇది కూడా సమస్యగానే ఉందని గ్రీన్ అన్నారు. ఇక్కడికి వచ్చిన విద్యార్థుల్లో ఎంత మంది తిరిగి వెళ్లిపోయారనే లెక్కలు కూడా లేవని అన్నారు.












Click it and Unblock the Notifications